Gudivada Amarnath

కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి: అమర్నాథ్

తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధితులకు ఎక్స్‌గ్రేషియో కోటి రూపాయలు ప్రకటించాలని మాజీ మంత్రి, వైసీపీ అగ్రనేత గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధకరమని అన్నారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం.. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి.. ఎక్స్‌గ్రేషియో కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లడ్డూని రాజకీయం చేశారు.. అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని భక్తులు భావిస్తున్నారని అన్నారు. ఇందుకు కారణమైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మృతుల కుటుంబాలకు వైసీపీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని గుడివాడ అమర్నాథ్ అన్నారు. మోదీ భజన మానేసి తిరుపతిలో భక్తుల, సౌకర్యాల మీద దృష్టి పెడితే ప్రాణాలు పోయేవి కాదని అన్నారు. గతంలో పవన్ కల్యాణ్ సనాతన దీక్ష, హిందూ ధర్మ దీక్ష చేశారు ఇప్పుడు ఏ దీక్ష చేస్తారో చూస్తామని అన్నారు.

ఈ పాప పరిహారం ఎలా సరిదిద్దుకుంటారో, సనాతన ధర్మాన్ని కాపాడే నాయకుడు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో స్పష్టమైన ప్రకటన ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. నిన్న మోదీ ఏపీకి ఎలాంటి హామీలు ఇవ్వలేదన్నారు. ఏపీ అభివృద్ధిపై మోదీ కట్టుబడి ఉన్నారా అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ గురించి కనీసం ఒక మాట.. ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.

Related Posts
ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ మరో పిటిషన్ !
Another petition of Ram Gopal Varma in AP High Court

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని రామ్‌గోపాల్‌ Read more

గరికపాటి నరసింహారావు పై తప్పుడు ప్రచారం
గరికపాటి నరసింహారావు పై తప్పుడు ప్రచారం

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త గరికపాటి నరసింహారావు బృందం కొంతమంది యూట్యూబ్ ఛానళ్లు మరియు వ్యక్తులు గరికపాటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఒక అధికారిక ప్రకటనలో, గరికపాటి Read more

అమరావతి లో సినిమాలకు ఫుల్ డిమాండ్ – చంద్రబాబు
chandrababu

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన చిట్‌చాట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ రంగంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం భారతీయ Read more

ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు సమావేశాలు
ప్రపంచ బిజినెస్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు (జనవరి 19) దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (WEF) సదస్సులో పాల్గొనడానికి బయలుదేరుతున్నారు. ఈ సదస్సులో భాగస్వాములు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *