cr 20241012tn670a336aa1223

కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎంపీ

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను, ఉద్యమకారులను మోసం చేశారని, ఆయన వల్ల ఎంతో మంది నష్టపోయారని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం కృషి చేసిన తనను కూడా తెలంగాణ భవన్ నుంచి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులలో ముంచాడని, ఉద్యమ పర్వంలో ఉన్నవారిని పక్కన పెట్టి వదిలేశారని విమర్శించారు.

రవీంద్రనాయక్ మాట్లాడుతూ, కేసీఆర్ గిరిజనులు, మహిళలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, వారిని పార్టీ నుంచి బయటకు తన్నేశారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక క్విడ్ ప్రో పేరుతో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు, నయీం, దేవాదాయ, వక్ఫ్, మిగులు భూములు కబ్జా చేశారని ఆరోపించారు. కేవలం భూములనే కాకుండా, రాష్ట్రంలోని వందలాది చెరువులు కూడా కనుమరుగయ్యాయని మండిపడ్డారు.

అదేవిధంగా, కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా అయినా తెలంగాణ నాశనం అవుతుందని హెచ్చరించారు. ఆయన కూతురు కవిత జైలుకు పాలవడానికి కూడా కేసీఆర్ కారణమని రవీంద్రనాయక్ ఆరోపించారు.

ఇదే సమయంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రవీంద్రనాయక్ ప్రశంసించారు. రేవంత్ రెడ్డి ప్రజా పాలనను నడుపుతున్నారని, ఆయనకు రాష్ట్ర ప్రజలు మద్దతుగా ఉండాలని సూచించారు.

Related Posts
ర‌హ‌దారుల‌పై అడ్డుగొడ‌ల‌ను తొల‌గించిన హైడ్రా
WhatsApp Image 2025 02 05 at 17.25.58 69208124

ర‌హ‌దారుల‌పై అడ్డుగొడ‌ల‌ను తొల‌గించిన హైడ్రామ‌ల్కాజిగిరిలో 1200 గజాల స్థ‌లానికి క‌బ్జాల‌ నుంచి విముక్తి. ర‌హ‌దారుల‌పై అడ్డుగొడ‌ల‌ను తొల‌గించిన హైడ్రా ప్రక్రియ అనుకున్నదాని కన్నా సులభంగా పూర్తయింది. న‌గ‌రంలోని Read more

రేవంత్ రెడ్డిని క‌లిసే యోచ‌న‌లో టాలీవుడ్ ప్ర‌ముఖులు
nagavamsi

టాలీవుడ్ ప్ర‌ముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి రాగానే ముఖ్య‌మంత్రిని కలుస్తామ‌ని Read more

ఫార్మసీ కంపెనీ లపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
mla anirudhreddy

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి, అరబిందో కంపెనీపై తీవ్ర విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పోలేపల్లి గ్రామానికి చెందిన స్థానిక రైతులు Read more

ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్‌ఎన్‌ రెడ్డి
BLN Reddy attended the ACB inquiry

హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో A-3 గా ఉన్న హెచ్‌ఎండీ మాజీ చీఫ్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *