కేరళలోని అలెప్పి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి భారీ వర్షం సమయంలో వేగంగా వచ్చిన కారు, బస్సును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు మెడికో స్టూడెంట్స్ మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులంతా ఎంబీబీఎస్ ఫస్టియర్ స్టూడెంట్స్‌గా గుర్తించబడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం కాలర్ కోడ్ వద్ద జరిగింది. బస్సును వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టగా, కారు పూర్తిగా నుజ్జవ్వడంతో అందులో ప్రయాణిస్తున్న స్టూడెంట్స్ అందరూ లోపలే ఇరుక్కుపోయారు.
క్షతగాత్రులను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది మెటల్ కట్టర్లను కట్ చేసి, వారి ప్రాణాలను రక్షించారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలే అయినా, వారిని చికిత్స చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన యువకులు దేవనందన్, మొహమ్మద్ ఇబ్రాహీం, ఆయుష్ షాజి, శ్రీదీప్ వాల్సన్, మొహమ్మద్ జబ్బర్‌గా గుర్తించారు. వీరు టీడీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థులు.
ఈ సంఘటన వారి కుటుంబాలకు ఎంతో దుఖాన్ని కలిగించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు, విద్యార్థులు కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.