కేన్-బెట్వా నదీ అనుసంధానం జాతీయ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ ప్రణాళికలో భాగంగా దేశంలో తొలిసారి నదీ అనుసంధానం ప్రాజెక్టు కార్యం రూపం దాల్చింది. మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్‌లో దౌదెన్ డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కానున్నది.
కేబీఎల్పీ ప్రాజెక్టు కోసం 44,605 కోట్లు ఖర్చు
కేన్ నదిలో ప్రవహించే అదనపు నీటిని.. ఉత్తరప్రదేశ్‌లోని బెట్వా నదికి తరలిస్తారు. 2021లోనే ఈ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం దక్కింది. కేబీఎల్పీ ప్రాజెక్టు కోసం సుమారు 44,605 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాజకీయ, పర్యావరణ కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యం అయ్యింది. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి నూరవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
బుందేల్ఖండ్‌లో పంటల సాగు
నదీ అనుసంధానం ద్వారా యూపీలోని బేట్వా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న బుందేల్ఖండ్‌లో పంటల సాగును పెంచనున్నారు. సుమారు 77 మీటర్ల ఎత్తు, రెండు కిలోమీటర్ల వెడల్పుతో కేన్-బెట్వా ప్రాజెక్టు కోసం డ్యామ్‌ను నిర్మిస్తున్నారు.
పన్నా టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఈ ప్రాజెక్టును కడుతున్నారు. దౌధాన్ డ్యామ్‌తో పాటు సుమారు 230 కిలోమీటర్ల కెనాల్ కూడా నిర్మించనున్నారు.
కేన్-బెట్వా నదీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన
Advertisements