KTRs brother in law Raj Pa 1

కేటీఆర్ దావత్ పార్టీ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

 




జన్వాడలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై కేటీఆర్ స్పందిస్తూ, “ఇళ్లలో దావత్‌లు చేసుకుంటే తప్పేముందంటూ” వ్యాఖ్యానించారు. అయితే, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Advertisements

కిరణ్ కుమార్ రెడ్డి తన విమర్శల్లో..రేవ్ పార్టీలకు అనుమతులు తీసుకోకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన తెలిపినట్లుగా, ఈ సంఘటన డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించేలా ఉందని, పార్టీలో ఉన్న వారెంత పెద్దవారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీపావళి వంటి పండుగలను రేవ్ పార్టీలతో పోల్చడం తగదని, ఇలాంటి కార్యకలాపాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో 111 జీవో ఎత్తివేయడంతో పలువురు నాయకులు ఫామ్‌హౌస్‌లు కట్టుకుని అడ్డుగా వాడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గతంలో రాజ్ పాకాల సన్ బర్న్ లాంటి ఈవెంట్స్ నిర్వహించిన చరిత్ర ఉందని, ఈ ఫామ్‌హౌస్ వ్యవహారం ప్రభుత్వంపై తీవ్రమైన ప్రశ్నలను రేకెత్తిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

Related Posts
మహిళల ఖాతాల్లోకి రూ.12వేలు – మంత్రి సీతక్క
minister sithakka

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సంక్షేమాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకం కింద సంవత్సరానికి రూ.12వేల ఆర్థిక సహాయాన్ని మహిళల Read more

ఫార్ములా ఈ రేసుపై నేటి నుండి ఈడీ విచారణ
enforcement directorate investigation will start from today on this formula race

హైదరాబాద్‌: ఫార్ములా ఈ రేసుపై నేటి నుంచి ఈడీ విచారణ షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేసు కేసుతో సంబంధం ఉన్న వారిని ఒక్కొక్కరిగా Read more

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కి తృణమూల్ మద్దతు
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కి తృణమూల్ మద్దతు

రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసి) మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం Read more

పాపం కర్ణాటక సీఎంకు అసలు సొంత ఇల్లే లేదట..
karnataka cm siddaramaiah

కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముడా స్కాం విషయంలో తనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ నిజాయతీతో పనిచేశానని, అవినీతి Read more

×