ktr

కేటీఆర్ అరెస్ట్ తప్పదా?

తెలంగాణాలో చలికాలంలో రాజకీయాల వేడిని పుట్టిస్తున్నది. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ తప్పదా? అనే చర్చ అంతటా వినిపిస్తున్నది. హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటీషన్ తిరస్కరణతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును ఏసీబీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కేటీఆర్ విచారణ కోసం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయం పై కేటీఆర్ సుప్రీంను ఆశ్ర యించారు. ఇదే సమయంలో హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులతో ఏసీబీ అఫీషియల్స్ భేటీ కావటంతో ఉత్కంఠ మొదలైంది. కేటీఆర్ అరెస్ట్ ప్రచారం వేళ ప్రతీ పరిణామం ఆసక్తి కరంగా మారుతోంది.

Advertisements


విచారణకు హాజరైన అరవింద్ కుమార్
ఫార్ములా-ఈ కారు రేసు కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. అటు హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది.

దీంతో, కేటీఆర్ సుప్రీంలో అప్పీల్ చేసారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం కేవియట్‌ దాఖలు చేసింది. ఇటు తాను ఏసీబీ విచారణకు వెళ్లేందుకు న్యాయవాదికి అనుమతి ఇవ్వాలని ఈ రోజు హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేయనున్నారు. రేపు (గురువారం) విచారణకు రావాలంటూ ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.

ఒకవేళ అరెస్టులు జరిగితే?

పోలీసు అధికారులతో ఈ కేసులో అప్రూవర్‌గా మారతానంటూ ఇప్పటికే ఆయన ప్రభుత్వానికి సమాచారం ఇవ్వటం తో ఈ రోజు అరవింద్ కుమార్ ఇచ్చే సమాచారం కీలకంగా మారనుంది. ఇదే కేసులో ఈడీ అధికారులు కేటీఆర్‌ను ఈ నెల 16న విచారణకు రావాలని తాజాగా సమన్లు జారీ చేశారు. విచారణ .. అరెస్ట్ ల దిశగా అడుగు లు వేస్తున్న వేళ ఏసీబీ ఉన్నతాధికారుల నుంచి వారికి కొన్ని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌ కమిషనర్‌తో కూడా ఏసీబీ ఉన్నతాధికారులు మాట్లాడినట్లు సమాచారం.

Related Posts
TG High court : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో వాదనలు
Arguments in the High Court on the Kancha Gachibowli land issue

TG High court: తెలంగాణ హైకోర్టులో కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్‌, హెచ్‌సీయూ విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ ప్రారంభమైంది. కంచ గచ్చిబౌలి Read more

Hanuman Jayanti: నగరంలో శాంతియుతంగా కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర
Hanuman Jayanti: నగరంలో శాంతియుతంగా కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర

హనుమాన్ శోభాయాత్రతో మార్మోగిన హైదరాబాద్ హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరం శోభాయాత్రలతో మార్మోగుతోంది. భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. Read more

saraswati pushkaralu : తెలంగాణలో పుష్కరాలు.. వెబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రులు
Pushkaralu in Telangana.. Ministers launch website

Saraswati Pushkaram: తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. మే 15 తేదీ 2025 నుంచి తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే Read more

నేటి నుంచి బతుకమ్మ సంబరాలు
bathukamma celebrations 202 1

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ బతుకమ్మ. ఏ పండుగకు కలవకున్నా ఈ పండుగకు మాత్రం ఆడపడుచులంతా కలుసుకుంటారు. బతుకమ్మ పండుగ వస్తోందంటే ప్రకృతి అంతా Read more

×