dog bite treatment

కుక్క వల్ల ప్రాణాలు కోల్పోయిన యువకుడు

చందానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుక్క తరిమినందున, ప్రాణ భయంతో మూడో అంతస్తు హోటల్‌ నుంచి దూకిన యువకుడు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మరణించాడు.

వివరాలలోకి వెళితే, తెనాలికి చెందిన ఉదయ్‌ (23) అనే యువకుడు హైదరాబాద్‌ ​ రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్నేహితులతో కలసి చందానగర్‌లోని ఓ హోటల్‌ కి పుట్టిన రోజు పార్టీ కోసం వెళ్ళాడు .హోటల్‌ లో నిలిచి ఉన్న సమయంలో హోటల్‌ మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క ఆ యువకుల వెంటపడింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో ఉదయ్‌ హోటల్ మూడో అంతస్తు నుంచి దూకాడు.

దూకడం వల్ల అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్నేహితులు ఉదయ్​ను ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్ర రక్తస్రావం కారణంగా ఆసుపత్రికి చేరకముందే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలవరపెట్టింది. కుక్కల బెడదపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన కుక్కల సమస్యపై నగరంలో మరింత దృష్టిని కేంద్రీకరిస్తోంది

Related Posts
ఏఐ ఆవిష్కరణను ప్రోత్సహిస్తున్న కెఎల్‌హెచ్‌
KLH Hyderabad promotes AI innovation with 2nd International Conference on AI Based Technologies

హైదరాబాద్: హైదరాబాద్‌లోని అజీజ్ నగర్ క్యాంపస్‌లో ఏఐ -ఆధారిత సాంకేతికతలపై ఇటీవలి పోకడలపై 2వ అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించడం ద్వారా కెఎల్‌హెచ్‌ అకడమిక్ ఎక్సలెన్స్‌లో మరో Read more

Day In Pics: న‌వంబ‌రు 15, 2024
15 11 24 day in pic feature copy

గురునానక్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని గురుద్వారా రాకబ్ గంజ్ సాహిబ్ వద్ద ప్ర‌త్యేక ప్రార్థనలు చేస్తున్న ముఖ్యమంత్రి అతిషి చెన్నైలోని మెరీనా బీచ్‌లో శుక్ర‌వారం చనిపోయిన భారీ Read more

అమెజాన్ ఫ్రెష్ వారి సూపర్ వాల్యూ డేస్..ఆఫర్లే ఆఫర్లు
Amazon Fresh is their super

బెంగుళూరు 2024: చలికాలం వస్తూ, తనతో పాటు వెచ్చదనాన్ని తెచ్చింది. మీకు అవసరమైన వెచ్చని ఆహారాన్ని, నిత్యావసరాలను అన్నింటినీ కూర్చి పెట్టుకోవటానికి ఇది అనువైన సమయం. అమెజాన్ Read more

UPI లావాదేవీల్లో సరికొత్త రికార్డు
upi papyments

ఇటీవల జరిగిన పండుగల సీజన్ సందర్భంగా యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అక్టోబర్ నెలలో లావాదేవీల సంఖ్య 16.58 బిలియన్లు, విలువ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *