Constables protest.Implementation of Section 163 at Secretariat

కానిస్టేబుళ్లు నిరసన..సచివాలయం వద్ద సెక్షన్ 163 అమలు

హైదరాబాద్‌: తెలంగాణలో వివిధ బెటాలియన్లకు చెందిన కానిస్టేబుళ్లు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ‘ఏక్ పోలీస్.. ఏక్ స్టేట్’ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ వారు గత వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పటివరకు 49 మంది టీజీఎస్‌పీ సిబ్బందిపై పోలీసులు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఇందులో 39 మందిని సస్పెండ్ చేసినట్లు మరియు 10 మందిని పూర్తిగా సేవల నుంచి తొలగించినట్లు సమాచారం.

ఈ క్రమంలో, ‘ఏక్ పోలీస్’ విధానాన్ని వెంటనే అమలు చేయాలని మరియు సిబ్బందిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, వివిధ బెటాలియన్ల కింద ఉన్న కానిస్టేబుళ్లు సోమవారం మరోసారి నిరసనలు చేపట్టనున్నారు.ఈ క్రమంలోనే వారు సచివాలయానికి ముట్టడి చేసేందుకు ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. సచివాలయ పార్కింగ్ ప్రాంగణంలో సుమారు 200 మంది పోలీసులు మోహరించారు. అలాగే ఎన్టీఆర్ స్టేడియం పరిసరాలలో కూడా మరికొన్ని పోలీసు బృందాలు ఉన్నాయి. సచివాలయ చుట్టూ సెక్షన్-163ని అమలు చేస్తున్నారు.

Related Posts
‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’
Freedom Healthy Cooking Oils to Honor Winners of 'Go for Freedom Gold Offer 2024' Bumper Draw

హైదరాబాద్‌ : దేశంలోని ప్రముఖ వంట నూనెల బ్రాండ్ అయిన ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ కోసం ‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ Read more

రేవంత్ రెడ్డి ది రెండు నాల్కల ధోరణి – MLC కవిత
Mlc kavitha comments on cm revanth reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ప్రజలను ఆకట్టుకునేందుకు ఒక మాట మాట్లాడి, గెలిచిన తర్వాత Read more

ఆసుపత్రిలో మోహన్ బాబు చికిత్స
mohanbabu hsp

ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న జరిగిన ఘర్షణ కారణంగా ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. Read more

ఇందిరా మహిళాశక్తి మిషన్ ప్రారంభించిన రేవంత్‌రెడ్డి
ఇందిరా మహిళాశక్తి మిషన్ ప్రారంభించిన రేవంత్‌రెడ్డి

ఇందిరా మహిళాశక్తి మిషన్ ప్రారంభించిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఇందిరా మహిళాశక్తి మిషన్ - 2025’ పాలసీని ప్రకటించారు. Read more