కాకినాడ : కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుందన్న ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక షిప్ ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. రేషన్ బియ్యం ని అక్రమంగా తరలిస్తున్న ఈ షిప్ లో బుధవారం నాడు అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సభ్యులు రేషన్ బియ్యం నమూనాలను సేకరిస్తున్నారు.
బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి వచ్చింది? ఎంత మొత్తంలో ఉంది? తదితర కోణంలో విచారణ జరుపుతున్నారు. పెసరెంటీలలో ఏ మేరకు ఇక్కడ నుండి బియ్యం రవాణా చేశారు అన్న వివరాలు కూడా వారు సేకరిస్తున్నారు. ఈ వివరాలను నివేదిక రూపంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు