pawan kalyan visits kakinad

కాకినాడ పోర్టు అక్రమ రవాణాపై ప్రధాని మోదీకి పవన్ లేఖ

కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను పట్టించుకోవాలి కదా? అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డారు. ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లారు. ‘ఈ పోర్టు నుంచి గత పాలనలో మొదలైన అక్రమ రవాణా ఇప్పటికీ కొనసాగుతోంది. జవాబుదారీతనం లేదు’ అని పవన్ ట్వీట్ చేశారు.

కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రధాని మోదీకి, రాష్ట్ర హోంమంత్రి అనితకు, దర్యాప్తు సంస్థలకు లేఖలు సిద్ధం చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించారు. ఇక్కడ ఎన్నో జాతీయ సంస్థలు, పెద్ద కంపెనీలు ఉన్నాయని… అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సంస్థలు, కంపెనీల రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే.. దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని, అక్రమ రవాణా చేస్తున్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని, ఈ మొత్తం వ్యవహారం వెనకున్న కింగ్ పిన్ లను గుర్తించాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేసారు. పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు అక్రమ రవాణా జరగవని గ్యారంటీ ఏంటి..? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా..? అని అనుమానాలు వ్యక్తం చేసారు.

కాకినాడలోని యాంకరేజీ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్‌ నౌకలో 640 టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులో మరో నౌకలోకి బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న బార్జ్ ఐవీ 0073లో ఉన్న 1064 టన్నుల బియ్యాన్ని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ గుర్తించారు.మొత్తంగా ఆ బియ్యం విలువ 6 కోట్ల 64 లక్షల 60 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం (పీడీఎస్‌) అడ్డదారిన కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతోందని జిల్లా కలెక్టర్‌కు పక్కాగా సమాచారం వచ్చింది.

వెంటనే ఆయన బార్జ్‌లు నిలిపే ప్రాంతం నుంచి పోలీస్, పోర్ట్, మెరైన్, రెవెన్యూ పౌర సరఫరాల బృందంతో కలిసి ఐదు నాటికల్‌ మైళ్ల (సుమారు తొమ్మిది కిలోమీటర్ల) దూరం సముద్రంలో ప్రయాణించి స్టెల్లా ఎల్‌ నౌక వద్దకు చేరుకున్నారు. ఆ నౌక పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. సుమారు 52 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఈ నౌకలో 38 వేల టన్నుల బియ్యం లోడ్‌ కాగా అందులో 640 టన్నులు పీడీఎస్‌ బియ్యం అని గుర్తించారు.

Related Posts
ఈ కార్ రేస్ పై స్పందించిన మంత్రి పొంగులేటి
Minister strong warning to registration department employees

తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నమోదైన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పులో ఏసీబీ దర్యాప్తులో Read more

‘కల్తీ నెయ్యి’ ఆరోపణలపై విచారణ.. సిట్ అధికారులు వీరే
tirumala laddu ge

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటయింది. ఈ సిట్ దర్యాప్తు కోసం Read more

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశం
biden zinping

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, శనివారం పెరూ లో జరిగిన ఏషియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) ఫోరమ్ సమ్మిట్ సమయంలో Read more

18న బీసీ సంఘాల నిరసనలు: ఆర్. కృష్ణయ్య
Protests of BC communities on 18th of this month..R. Krishnaiah

42% రిజర్వేషన్లకు కచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిందే.. హైదరాబాద్‌: కులగణన సర్వే మళ్లీ జరపాలని, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *