kamareddy congres

కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ శ్రేణులు షాక్ …

తెలంగాణాలో అధికార పార్టీ కాంగ్రెస్ కు సొంత పార్టీ శ్రేణులే భారీ షాక్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండామోస్తు వచ్చిన తమను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికీ పదవులు ఇవ్వడం పై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుక్కారు. గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల పరిధిలో సీనియర్‌ కార్యకర్తలు ఉన్నా.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన దుర్గం శ్యామలకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

Advertisements

దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఇటీవల కాంగ్రెస్‌లోకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులకు పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమ ఆవేద‌నను పార్టీ పెద్దలు గుర్తించకపోతే హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ ఎదుట నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను తొలగించి.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ ప్రతిపాదించిన ఒరిజినల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Related Posts
మినీ మేడారం జాతరకు వేళాయే..
medaram

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళా అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు సమయం ఆసన్నమైంది. మహాజాతర ముగిసిన ఏడాదికి అదే Read more

SLBC టన్నెల్లోకి ఊట నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే?
spring water

తెలంగాణలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో నిరంతరంగా వస్తున్న నీటి ఊటలతో సహాయక చర్యలు తీవ్రంగా ఆటంకానికి గురయ్యాయి. ఈ నీటి ప్రవాహం కారణంగా, టన్నెల్లో రక్షణ పనులు మరింత Read more

MPs salaries hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం
The Center has increased the salaries of MPs

MPs salaries hike: దేశవ్యాప్యంగా ఎంపికైన ఎంపీల జీతాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇచ్చే లక్ష రూపాయల జీతాన్ని లక్షన్నరకు పెంచింది. జీతంతోపాటు Read more

డిసెంబర్ లోపు మిగిలిన వారికి రుణమాఫీ చేస్తాం – మంత్రి పొంగులేటి
ponguleti runamafi

రాష్ట్ర రెవెన్యూ సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఇల్లెందు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ.. డిసెంబర్ నెలలోపు మిగిలిన వారికి కూడా Read more

Advertisements
×