bandi musi

కాంగ్రెస్ ప్రభుత్వం పై బండి సంజయ్ కీలక ఆరోపణలు

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్.. మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.మీడియాతో మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని కూడా ఏటీఎంలా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంద”ని విమర్శించారు.

మూసీ ప్రక్షాళన పేరుతో పరివాహక ప్రాంతంలోని నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల అప్పు తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, “వడ్డీల రూపంలో పది నెలల్లోనే రూ.60 వేల కోట్లు చెల్లించామని” వివరించారు. “పాలకులు చేస్తున్న అప్పుల కారణంగా రాష్ట్రంపై, ప్రజలపై భారం పడుతోంది” అని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని చెప్పారు.

బీజేపీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా లేదని, అయితే “ఈ ప్రభుత్వ దోపిడీ, హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రం తాము వ్యతిరేకమ”న్నారు. ఈ పరిస్థితులను నిరసిస్తూ రేపు ఇందిరా పార్క్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Related Posts
ఆంధ్ర-తెలంగాణ భాయ్ భాయ్ అంటున్న రేవంత్ రెడ్డి
ఆంధ్ర-తెలంగాణ భాయ్ భాయ్ అంటున్న రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కోసం కలిసి పనిచేయవలసిన అవసరాన్ని Read more

డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet meeting on 4th December

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం డిసెంబర్ 4వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు Read more

ఈ నెల 17 వరకు వల్లభనేని వంశీకి రిమాండ్
Vallabhaneni Vamsi remanded until the 17th of this month

అమరావతి: గన్నరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో దళితుడిని కిడ్నాప్​చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం విజయవాడ సబ్​జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ​ను Read more

తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్
తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్

తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 9వ తేదీ నుండి Read more