కల్కి సీక్రెట్స్ రివీల్ చేసిన మేకర్స్‌

కల్కి సీక్రెట్స్ రివీల్ చేసిన మేకర్స్‌

కల్కి 2898 ఏడీ ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి భాగం విడుదల సమయంలోనే సీక్వెల్‌ను మరో స్థాయిలో చూపించబోతున్నామని యూనిట్ హింట్ ఇచ్చింది. ఇప్పుడు నిర్మాత అశ్వనీదత్ తాజా అప్‌డేట్స్‌తో ఈ అంచనాలను మరింత పెంచారు. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన కల్కి 2898 ఏడీ భవిష్యత్తును మైథాలజీతో మిళితం చేసిన విజువల్ వండర్‌గా నిలిచింది.

Advertisements
kalki
kalki

ప్రభాస్ కర్ణుడి అవతారంగా కనిపించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇది వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు సాధించడంతో పాటు, నటీనటుల కాస్టింగ్ విషయంలో కూడా నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్ అయింది. తాజాగా అశ్వనీదత్ ఇచ్చిన అప్‌డేట్స్ ప్రకారం, మొదటి భాగంలో కొద్ది సేపు మాత్రమే కనిపించిన కమల్ హాసన్ సీక్వెల్‌లో పూర్తి స్థాయి పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ మరియు కమల్ హాసన్ మధ్య సీన్లు ఈ పార్ట్‌2లో ప్రధాన హైలైట్‌గా ఉండనున్నాయని వెల్లడించారు.

kalki 2
kalki 2

అదే విధంగా, అమితాబ్ బచ్చన్ మరియు దీపికా కూడా సీక్వెల్‌లో కీలక పాత్రల్లో కనిపించనున్నారని చెప్పారు. అయితే, రెండో భాగంలో కొత్త పాత్రలు పెద్దగా ఉండకపోవచ్చని అశ్వనీదత్ పేర్కొన్నారు. మొదటి భాగం షూటింగ్ సమయంలోనే కొన్ని సన్నివేశాలను సీక్వెల్‌ కోసం కూడా చిత్రీకరించారు. ప్రస్తుతం పార్ట్ 1 విజయంతో, నాగ్ అశ్విన్ పార్ట్ 2 స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరుస్తున్నారు.

prabhas amitabh bachchan and kamal haasan kalki
prabhas amitabh bachchan and kamal haasan kalki

త్వరలోనే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక, షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. సీక్వెల్‌లోని భారీ మలుపులు, ప్రభాస్ వర్సెస్ కమల్ హాసన్ కాంబినేషన్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సరికొత్త టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్‌తో కల్కి 2 ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లేలా రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

Related Posts
రోషన్ ‘ఛాంపియన్’ గ్లింప్స్ విడుదల
రోషన్ ‘ఛాంపియన్’ గ్లింప్స్ విడుదల

శ్రీకాంత్ తనయుడు రోషన్ టాలీవుడ్‌లో మంచి ఎంట్రీ ఇచ్చిన తరువాత కొంత గ్యాప్ తీసుకుని ‘పెళ్లిసందడి’ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత మరో Read more

నేషనల్ అవార్డ్ కోసం వెయిటింగ్ – సాయిపల్లవి
National Award Sai Pallav

టాలెంటెడ్ యాక్ట్రెస్, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి తన కలను బయటపెట్టారు. జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అవార్డు అందుకున్న రోజున తన Read more

రజనీకాంత్‌కు విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం పూజలు
రజనీకాంత్‌కు విగ్రహం ఏర్పాటు చేసి నిత్యం పూజలు

సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు ఎంతో ప్రేమను చూపిస్తూ, తాజాగా మరొక అద్భుతమైన సంఘటనను ప్రపంచానికి పరిచయం చేశారు. ఒక అభిమాని, కార్తీక్, తన ఇష్టమైన Read more

నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: నిర్మాత ఎస్ కె ఎన్
నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు: నిర్మాత ఎస్ కె ఎన్

తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాము తెలుగు రాని హీరోయిన్ లను అభిమానిస్తామని.ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే Read more

Advertisements
×