job

ఒరాకిల్ సూపర్ జాబ్ ఆఫర్

పెద్ద ఐటీ కంపెనీల్లో జాబ్ కొట్టాలి, లైఫ్ సెటిల్ చేసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల్లోని టెక్కీలు భావిస్తున్నారు. ఈక్రమంలో టాప్ టెక్ దిగ్గజాలు హైదరాబాద్ కేంద్రంగా నియామకాలను చేపడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఒరాకిల్ కంపెనీ రిలీజ్ చేసిన ప్రిన్సిపల్ టెక్నికల్ అకౌంట్ రిప్రజెంటేటివ్ పొజిషన్ కోసమే. దీనికోసం ఒక ఓపెనింగ్ ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే ఉద్యోగం కోసం 4-8 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తులు జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. అయితే దీనికి వార్షిక వేతన ప్యాకేజీ ఎంత ఆఫర్ చేస్తున్నారనే విషయాన్ని కంపెనీ బహిర్గతం చేయలేదు. ఈ జాబ్ రోల్ కింద కలకత్తా, ముంబై, దిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, బెంగళూరులో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.


ఒరాకిల్ డేటాబేస్, ఫ్యూజన్ అప్లికేషన్స్‌లో మంచి సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉండాలని వెల్లడించింది. ఒరాకిల్ సాస్ ఉత్పత్తులపై అవహగాన అవసరమని, టెక్నికల్ ఆర్కిటెక్చర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ అవగాహన చాలా ముఖ్యమని కంపెనీ వెల్లడించింది. ఉద్యోగం కోసం అభ్యర్థించే వ్యక్తి మల్టీ టాస్కింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు అద్భుతమైన టీమ్ ప్లేయర్, కొత్త సాంకేతికతలు & సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని కంపెనీ వెల్లడించింది.

ఇక విద్యార్హతల విషయానికి వస్తే.. యూనివర్సిటీ డిగ్రీ, పీజీ టెక్నికల్ లేదా మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్ అవసరమని కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో బలమైన ఆర్గనైజేషన్ స్కిల్స్, ఓరియంటెడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరమని కంపెనీ వెల్లడించింది. సర్వీస్ ప్లానింగ్, టెక్నాలజీ చేంజ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ కంట్రోల్, సర్వీస్ గవర్నెన్స్, ఇష్యూ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, లీడర్ షిప్ వంటివి కలిగి ఉండాల్సి ఉంటుంది. అభ్యర్థికి టెక్నికల్/ఫంక్షనల్ మరియు ప్రాజెక్ట్/ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ అనుభవంతో సహా ఒరాకిల్ ఉత్పత్తులలో 11 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉండాలి.

Related Posts
నేడు ‘రైతు పండుగ’ సభకు సీఎం
cm revanth

పాలమూరులో గత రెండు రోజులుగా నిర్వహిస్తోన్న రైతు పండుగకు సీఎం రేవంత్ రెడ్డి నేడు హాజరుకానున్నారు. లక్ష మంది రైతులతో నిర్వహించే ఈ సభ కోసం ఇప్పటికే Read more

నా మీద కూడా కేసులు న‌మోదు చేస్తారా డీజీపీ గారూ..? కేటీఆర్ ప్రశ్న
BRS held a huge public meeting in April 27

హైదరాబాద్‌: ఆ రైతును నేను కూడా కలిశాను… అతనితో మాట్లాడాను… మరి నాపై కూడా కేసు పెడతారా డీజీపీ గారూ? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ Read more

నేడు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
CM Revanth Reddy will start Indiramma Houses today

మొదటి విడతలో 72,045 ఇళ్లకు శంకుస్థాపన హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఈరోజు మరో అడుగు పడనుంది. జనవరి 26న తొలి విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా Read more

పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి
పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి

సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి పొందింది. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరిగే Read more