ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు

ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు

ఒడిశా గవర్నర్‌ రఘుబర్‌దాస్‌ రాజీనామాతో.. ఆయన స్థానంలో కంభంపాటి హరిబాబు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి శరణ్‌ సింగ్‌ ప్రమాణం చేయించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కంభంపాటి హరిబాబు 2021 జులైలో తొలిసారి మిజోరం గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. రాజధాని భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌, మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

 ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు


ఒడిశా గవర్నర్‌ రఘుబర్‌దాస్‌ రాజీనామాతో.. ఆయన స్థానంలో కంభంపాటి హరిబాబును నియమిస్తూ గతేడాది డిసెంబర్‌లో కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యద‌ర్శి అజ‌య్ కుమార్ భ‌ల్లా ఇవాళ మ‌ణిపూర్ గ‌వ‌ర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భ‌వ‌న్‌లోని ద‌ర్బార్ హాల్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జ‌రిగింది.
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నరులు
దేశంలోని ఐదు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. బీహార్‌ గవర్నర్‌గా ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌, కేరళ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌, ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్‌గా జనరల్‌ విజయ్‌ కుమార్‌ సింగ్‌, మణిపూర్‌ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లాను నియమించింది.

Related Posts
భారతీయులకు సౌదీ అరేబియా షాక్
visa

తమ దేశానికి వచ్చే వారిని నియంత్రించడంలో భాగంగా సౌదీ అరేబియా వీసా రూల్స్‌ను కఠినతరం చేసింది. దీంతో భారత్ నుంచి అధికంగా సౌదీ అరేబియాకు వెళ్లే వారికి Read more

ఏపీలో త్వరలో లిక్కర్ ప్రీమియం స్టోర్లు
premium liquor stores

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ప్రీమియం లిక్కర్ బ్రాండ్ల విక్రయానికి ప్రత్యేకంగా ప్రీమియం స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఈ స్టోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ Read more

వైకుంఠ ఏకాదశి: తిరుమలలో ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి: తిరుమలలో ఏర్పాట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె. శ్యామలరావు జనవరి 10 నుండి 19 వరకు నిర్వహించబోయే వైకుంఠ ఏకాదశి సందర్బంగా సాధారణ యాత్రికులకు వైకుంఠ Read more

విశాఖ డ్రగ్స్ కేసు: సీబీఐ ప్రకటన కలకలం
vizag drags case

విశాఖపట్నం పోర్టుకు బ్రెజిల్ నుంచి 25,000 టన్నుల డ్రగ్స్ వచ్చినట్టు ఆరోపణలపై గతంలో పెద్ద చర్చ జరిగింది. ఈ కేసు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *