AP High Court swearing in three additional judges

ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

అమరావతి : ఏపీలో ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నిర్వహించారు. సోమవారం హైకోర్టు తొలి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్వరరావు కుంచెం (కుంచం), తూటా చంద్ర ధన శేఖర్ (టిసిడి శేఖర్), చల్లా గుణరంజన్ మూడువురు న్యాయమూర్తులు ప్రమాణం చేశారు.

కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం హైకోర్టులో అత్యంత సాధారణంగా జరిగింది, ఈ వేడుకలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోని అనేక న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి.పొన్నారావు, హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ డా. వై. లక్ష్మణరావు, పలువురు రిజిష్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అదనపు న్యాయమూర్తులు సాధారణంగా న్యాయమూర్తులుగా లేదా సాధారణంగా ‘శాశ్వత’ న్యాయమూర్తులుగా పిలువబడే ముందు రెండు సంవత్సరాల వ్యవధిలో నియమిస్తారు. మంత్రిత్వ శాఖ ప్రకారం, కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధయ్య రాచయ్యను శాశ్వత న్యాయమూర్తిగా నియమించగా, న్యాయవాదులు మహేశ్వరరావు కుంచెం, టిసిడి శేఖర్ మరియు చల్లా గుణరంజన్‌లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు.

Related Posts
Pawan Kalyan: వైసీపీ హ‌యాంలో భారీగా అవినీతి: ప‌వ‌న్ క‌ల్యాణ్
Pawan Kalyan: వైసీపీ హ‌యాంలో భారీగా అవినీతి: ప‌వ‌న్ క‌ల్యాణ్

ఉపాధి హామీ పథకంలో అవినీతిపై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు అసెంబ్లీలో పవన్ ఆరోపణలు ఏపీ ఉపాధి హామీ పథకాన్ని గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా Read more

వల్లభనేని వంశీని మరో చోటుకు తరలిస్తున్న పోలీసులు
వల్లభనేని వంశీని మరో చోటుకు తరలిస్తున్న పోలీసులు

కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. తొలుత ఆయనను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ కు Read more

నిధులన్నీ కుంభమేళాకేనా..? మమత బెనర్జీ
kumbh mela 2025

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగే కుంభమేళాకు వేల కోట్ల నిధులను కేటాయిస్తున్న NDA ప్రభుత్వం, బెంగాల్‌లో జరగే Read more

సిద్ధం అవుతున్న సంక్రాంతి పుంజులు
సిద్ధం అవుతున్న సంక్రాంతి పుంజులు

సంక్రాంతి పండుగ అంటే కోడి పందేల సందడి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందేలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ పందేల కోసం రాష్ట్రంలోని వివిధ Read more