ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీలో కేబినెట్ మీటింగ్ ఇంకా కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

 ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు


ఈఎస్ఐ ఆసుపత్రికి ఆమోదం
తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి పడకలను 100కు పెంచాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటు, ఎస్‌ఐపీబీ అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు, చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై చర్చ జరుగుతోందని సమాచారం.
ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణాలకు ఆమోదం
రాజధాని అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్ ఓకే చెప్పింది. సీఆర్‌డీఏ 44వ సమావేశంలో నిర్ణయించిన రెండు పనులకు కూడా ఆమోదముద్ర వేసింది. మున్సిపల్‌ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపింది. దీంతో భవనాలు, లేఅవుట్‌ల అనుమతుల జారీ బాధ్యత మున్సిపాలిటీలకు కట్టబెట్టినట్లైంది.

Related Posts
భారత్ ఫోర్జ్ ప్రతినిధులతో నారా లోకేశ్ భేటీ
LOKESH DAVOS

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనలో భాగంగా భారత్ ఫోర్జ్ సంస్థ వైస్ చైర్మన్ కళ్యాణితో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో రక్షణ పరికరాల తయారీకి Read more

పోలవరంపై బడ్జెట్ కు ముందే రాష్ట్రపతి ప్రకటన!
droupadi murmu

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కీలక ప్రసంగం చేశారు. ఉభయసభలనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆమె వివరించారు. Read more

జనసేనలో చేరిన గంజి చిరంజీవి
ganji janasena

ఏపీలో వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజయంతో, పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన చాలామంది నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కీలకమైన నేతలు Read more

విజయసాయిరెడ్డి కి కౌంటర్ ఇచ్చిన షర్మిల
Vijayasai sharmila

వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల వివాదం గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరియు వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విజయసాయిరెడ్డి ఇటీవల తన వ్యాఖ్యల్లో ఇది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *