ap cabinet

ఏపీ కేబినెట్ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల ఫైర్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని విభాగాల్లో ప్రక్షళన చేస్తున్నది. ఇందులో భాగంగా ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు అనుకున్నంత స్దాయిలో ప్రభావవంతంగా పనిచేయడం లేదని భావిస్తున్న కూటమి సర్కార్ వాటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. అలాగే అందులో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ లో తీసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య తీర్మానించింది. గుంటూరు బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ కె.అనురాధ, డాక్టర్‌ గురుస్వామి కేబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

రేషనలైజేషన్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కలెక్టర్లు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వాలని ఉద్యోగులు నిర్ణయించారు, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాడాలని నిర్ణయించారు. గ్రామ, వార్డు సచివాయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని, ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఆలస్యం చేయడం వల్ల నష్టపోయిన తొమ్మిది నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు కోరుతున్నారు. ఉద్యోగంలో చేరిన తేదీ నుండి సర్వీసు లెక్కించి, నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న డిఎలు ఇవ్వాలని సచివాలయాల ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.
సచివాలయాల్లో ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రెటరీలకు యాప్‌ల పని భారం తగ్గించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అనేక రకాలైన సర్వేలు ఇచ్చి త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగులను ఒత్తిడి చేయడం సరికాదని వారు చెప్తున్నారు.

Related Posts
“సరస్వతి పవర్” భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
pawan kalyan to participate in palle panduga in kankipadu

అమరావతి: ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరియు ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల Read more

జగన్ వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల కౌంటర్
nimmala

పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ-వైసీపీ మధ్య తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్ లాగా వాడుకున్నారని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించగా, ఆయన వ్యాఖ్యలకు Read more

శ్రీవారి మెట్ల ఉత్సవ ముహూర్తం పిక్స్
శ్రీవారి మెట్ల ఉత్సవ ముహూర్తం పిక్స్

తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది మంగళవారం నాడు 73,599 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.ఇందులో 16,069 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు Read more

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు
WhatsApp Services in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ సేవలను అందించేందుకు కొత్త విధానాన్ని ప్రారంభించింది. నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అధికారికంగా ప్రారంభించనుంది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *