ap mega dsc

ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా

ఏపీలో మెగా డీఎస్సీ 2024 వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. ఈ రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడింది. టెట్‌ ఫలితాలు ప్రకటించిన తర్వాత, మెగా డీఎస్సీ ప్రకటన చేయాలనీ అనుకున్నారు. కానీ ఈ ప్రకటనకు సంబంధించి వాయిదా పడింది.

ఈ వాయిదా వెనుక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీఎస్‌ ఈ సమస్యపై విమర్శలు చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందు ఎలాంటి నియామకాలు ప్రకటించకూడదని అందుకే వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

ఈ మొత్తం మెగా డీఎస్సీలో 16,347 పోస్టులు ఉంటాయని, ఇందులో ఎస్జీటీ (6371 పోస్టులు), స్కూల్‌ అసిస్టెంట్లు (7725 పోస్టులు), టీజీటీ (1781 పోస్టులు), పీజీటీ (286 పోస్టులు), ప్రిన్సిపల్ (52 పోస్టులు), పీఈటీ (132 పోస్టులు) ఉన్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు మూడు రోజులలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయబోతారని వినికిడి.

Related Posts
బీజేపీకి అభినందనలు తెలిపిన కేజీవాల్
aravind tweet

ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ఆశలతో కమలం పార్టీకి ప్రజలు గెలుపును అందించారని, Read more

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు
New pass books in AP from April 1

ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను పంపిణీ అమరావతి : ఏపీ రెవెన్యూ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న Read more

నేడు ప్రధాని మోడీతో సమావేశం కానున్న పవన్‌ కల్యాణ్
BJP protests in Telangana from 30th of this month 1

న్యూఢిల్లీ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతుంది. నిన్న వరుసగా పలువురు కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతితో భేటీ అయిన విషయం Read more

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోలకు నిషేధం.. !
Assembly sessions to resume

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఫోటోలు, వీడియోలు తీయకూడదని ఆంక్షలు విధించారు. కొత్త నిబంధనను అమలు చేయాలంటూ అసెంబ్లీ లాబీల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ Read more