pention

ఏపీలో భరోసా పింఛన్ల పంపిణీ

ఏపీలో కూటమి ప్రభుత్యం వచ్చాక, ఎన్నికల హామీలో భాగంగా పేదలకు భరోసా పింఛన్ల పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీకి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పంపిణీ కార్యక్రమం చేప‌ట్టింది స‌ర్కార్‌. ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు 83.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి అయిన‌ట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల సమయానికి 53,22,406 మందికి రూ. 2,256 కోట్లు పంపిణీ చేశారు.


ఉదయం నుంచి శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొన‌సాగుతోంది. రాష్ట్రంలోని 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం కూట‌మి ప్ర‌భుత్వం రూ. 2,717 కోట్లు విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ప్ర‌భుత్వం 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేప‌ట్టింది.
ఇక సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
లబ్దిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీస్తున్నారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జియో ట్యాగింగ్ విధానాన్ని ప్ర‌భుత్వం తీసుకువచ్చింది.

Related Posts
రామ్మూర్తి నాయుడు మృతికి ప్రధాని సంతాపం..నారా రోహిత్‌కు లేఖ
PM Modi condolence letter to Nara Rohit on death of Rammurthy Naidu

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ తండ్రి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. మొన్న Read more

ఎన్నికల్లో ఓటమికి కారణం అదే – జగన్
jagan mohan reddy 696x456

ప్రజల కోసం ఎంతో పని చేసినప్పటికీ తాము గెలవలేకపోవడం బాధ కలిగించింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ Read more

ఏపీ సర్కార్ కు కేంద్రం సూచనా..
polavaram

పోలవరం మెయిన్ డ్యాం పనులకు కేంద్రం రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా చెల్లించడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు కంపెనీలు మేఘా, బావర్లను Read more

రామ్ గోపాల్ వర్మకు ఏపీ సర్కార్ నోటీసులు
RGV

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో 'వ్యూహం' సినిమాకు అక్రమంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందారన్న వ్యవహారంపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *