Fireworks accidents in ap

ఏపీలో బాణసంచా ప్రమాదాలు… ముగ్గురి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన బాణసంచా ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఏలూరులో జరిగిన ఘటనలో, బైక్‌పై టపాసులు తీసుకెళ్తున్న సుధాకర్ అనే వ్యక్తి రోడ్డుపై ఉన్న గుంతలో బండి అదుపుతప్పడంతో టపాసులు రోడ్డుపై పడి పేలాయి. ఈ పేలుడు ధాటికి సుధాకర్ సజీవదహనమయ్యాడు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడగా, వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

మరోవైపు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో నిన్న సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఉరుములతో కూడిన వర్షం సమయంలో పిడుగు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు వి.శ్రీవల్లి (42) మరియు జి.సునీత (35)గా గుర్తించారు. మరో ఐదుగురు తీవ్ర గాయపడగా, వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుంచి తొమ్మిది మంది స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.

Related Posts
అమరావతి లో సినిమాలకు ఫుల్ డిమాండ్ – చంద్రబాబు
chandrababu

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన చిట్‌చాట్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ రంగంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం భారతీయ Read more

పవనే ఇక రాష్ట్రానికి దిక్కు: ఉండవల్లి కామెంట్
పవనే ఇక రాష్ట్రానికి దిక్కు: ఉండవల్లి కామెంట్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిమానం చాటుకున్నారు. గతంలో ఓసారి పవన్ కళ్యాణ్ పిలిస్తే Read more

ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు..
AP Assembly budget meetings from 24th of this month

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు Read more

ఏపీలో ‘ఉపాధి’ కూలి రోజుకు రూ.300
300 rupees per day for 'upa

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కూలీలకు రోజువారీ కూలి రూ.300 చెల్లించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ.255గా ఉన్న కూలీని పెంచి రూ.300 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *