imd warns heavy rains in ap and tamil nadu next four days

ఏపీలో అతి తీవ్ర భారీ వర్షాలు పడే ఛాన్స్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెంగల్’ తుఫాన్ గడిచిన 6గంటల్లో 10 కిమీ వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ సాయంత్రానికి కారైకాల్- మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుపాను కారణంగా సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

తుపాను ప్రభావంతో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమతతంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తిరుపతి,నెల్లూరు,ప్రకాశం తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

తెలంగాణలో ఇవాళ్టి నుంచి (నవంబర్ 30) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 1వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 2వ తేదీన కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ఇక 3వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.

Related Posts
కాంగ్రెస్‌ పాలనలో ఒరిగింది ఏమిటీ..?: కేటీఆర్‌
ktr comments on congress

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. సంక్షేమ Read more

‘అదానీ-రేవంత్ భాయ్ భాయ్’ టీషర్ట్ తో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు
KTR Assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 'అదానీ-రేవంత్ భాయ్ భాయ్' అని ప్రింట్ చేసిన టీషర్ట్స్ ధరించి అసెంబ్లీకి వచ్చారు. Read more

టెక్సాస్‌లో సుడిగాలి : 7,000 పైగా విమానాలు ఆలస్యం, 200 రద్దు
flights delay

2024 డిసెంబర్ 28న, టెక్సాస్‌లో ఘోరమైన టోర్నడోలు సంభవించాయి. ఈ భారీ ప్రకృతి దుర్గటనలో 10 కంటే ఎక్కువ టోర్నడోలు వర్ణించబడ్డాయి. ఈ టోర్నడోలు ఈ రాష్ట్రం Read more

నీటిని పీల్చుకునే ‘ట్రోవాంట్స్’ రాళ్లు ఉన్నాయనే సంగతి తెలుసా..?
Trovants

యూరప్లోని రొమేనియాలో ఉన్న వింత రాళ్లు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్య పరుస్తున్నాయి. 'ట్రోవాంట్స్' అని పిలిచే ఈ ప్రత్యేకమైన రాళ్లు వర్షాలు పడిన తర్వాత వాటంతటవే పెరిగిపోతుంటాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *