ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అందింది. ఏపీ ప్రస్తుతం ఉన్న ఆర్దిక పరిస్థితుల్లో కేంద్ర నిర్ణయం ఉపశమనంగా మారనుంది. కేంద్రంలో…రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన నాటి నుంచి ఏపీ విషయంలో గతం కంటే సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీకి పూర్తిగా అండగా నిలుస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అమరావతి, పోలవరం కు నిధులు ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం మరోసారి ఏపీకి నిధులు విడుదల చేసింది.

ఏపీకి 7 వేల కోట్ల నిధులు ఆర్దికంగా కష్టాల్లో ఉన్న ఏపీకి కేంద్రం రిలీఫ్ ఇచ్చింది. మరో రెండు నెలల్లో ప్రస్తుత ఆర్దిక సంవత్స రం ముగియనుంది. ఈ లోగా ప్రభుత్వం పైన సాధారణ ఖర్చులతో పాటుగా పథకాల నిర్వహణ భారంగా మారింది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో అమ్మఒడి, అన్నదాత సుఖీభవ పథకాల అమలు పైన నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో విద్యార్ధుల ఫీ రీయంబర్స్ మెంట్ నిధుల విడుదల కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఇటు ప్రతీ వారం ఆర్బీఐ నుంచి ప్రభుత్వం రుణ సేకరణ చేస్తోంది. దీంతో.. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీకి రిలీఫ్ గా నిలుస్తోంది.
పన్నుల వాటా విడుదల కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటాల పంపిణీ కింద ఏపీకి రూ.7,002.52 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణకు ఇదే పద్దు కింద కేంద్రంరూ.3,637 కోట్లను విడుదల చేసింది. జనవరి నెలకుగాను ఇవ్వాల్సిన పన్నుల వాటా పంపిణీ నిధులను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసింది. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం రూ.1,73,030 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి అనుగుణంగా పన్నుల వాటా విడుదల చేశామని కేంద్రం తెలిపింది.