rajiv rajan mishra

ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఇటీవల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా సభ్యుడిగా ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. దీంతో రాజీవ్ రంజన్ మిశ్రా నేడు గుంటూరు కలెక్టరేట్ లో అభిప్రాయ సేకరణ జరిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతిపత్రాలు అందించారు.

rajiv ranjan2


ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వెనుకబడిన అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. త్వరితగతిన వర్గీకరణ చేసి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ, ఆయా కులాలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా మేలు చేసేందుకు చంద్రబాబు ముందుకొచ్చారని తెలిపారు.

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందిస్తూ… మాదిగలు రిజర్వేషన్ ఫలాలను తక్కువగా పొందుతున్నారని వివరించారు. ఎస్సీ వర్గీకరణ చేయడమే న్యాయబద్ధం అని స్పష్టం చేశారు. దీనిపై మాలలు, మాదిగలు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారని అనుకుంటున్నట్టు తెలిపారు.

Related Posts
సంక్రాంతి హడావిడిలో ప్రైవేట్ బస్సుల దోపిడీ!
సంక్రాంతి హడావిడిలో ప్రైవేట్ బస్సుల దోపిడీ!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు తమ టికెట్ రేట్లను భారీగా పెంచారు. సాధారణ రోజుల్లో రూ.1,000 నుండి రూ.1,800 మధ్య Read more

ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అమరావతి సెక్రటేరియట్‌లోని రియల్‌ టైం గవర్నెన్స్‌ సొసైటీ పరిధిలో వివిధ విభాగాలకు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆర్‌టీజీఎస్‌, ఎవేర్‌ హబ్‌, Read more

టీడీపీ పార్టీ ఆఫీస్ లో రామ్మూర్తి నాయుడుకు సంతాపం తెలిపిన నేతలు
ramurthinaidu

రామూర్తినాయుడి మృతి పట్ల టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ.. రామూర్తినాయుడి చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. పేదల గొంతుకగా.. పేదల మనిషిగా సీఎం చంద్రబాబుకు Read more

రాష్ట్ర విభజనపై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ex cm kiran kumar reddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖరరెడ్డి బతికుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని చాలా మంది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *