si and constable

ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్

గురువారం వెలుగు చూసిన కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ,లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ డెత్ కేసులో మిస్టరీ వీడటం లేదు. ముగ్గురూ సూసైడ్ చేసుకున్నారా లేక ఎవరైనా బ్లాక్ మెయిల్‌ ప్రాణాలు తీసుకునేందుకు ప్రేరేపించాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పూటకో మలుపు తిరుగుతున్న ఈకేసులో పోలీసులు కీలకమైన విషయాల్ని రాబట్టారు.
వాట్సాప్ చాటింగ్‌ డేటాను సేకరించిన పోలీసులు
మృతుల కాల్ డేటాతో పాటు వాళ్ల వాట్సాప్ చాటింగ్‌ సేకరించారు. ఇప్పుడు ఈకేసులో ఇదే అత్యంత కీలకంగా మారినట్లుగా తెలుస్తోంది. చనిపోయే ముందు ముగ్గురూ ఒకే కారులో అడ్లూరు దగ్గరున్న ఎల్లారెడ్డి చెరువు దగ్గరకు వెళ్లినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది.
వివాహేతర సంబంధమే కారణమా?
వివాహేతర సంబంధం ఇద్దరు వ్యక్తులతో పాటు మరొకరి ప్రాణాల్ని బలిగొంది. కామారెడ్డి జిల్లాలో ఇటీవల బిక్నూర్ ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తులు బలవన్మరణం చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కానిస్టేబుల్ శృతి, ఎస్ఐ సాయికుమార్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగినట్లుగా తెలుస్తోంది. వీళ్లిద్దరికి మధ్యవర్తిగా ఉన్న నిఖిల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది ఇప్పుడు ఈకేసులో కీలకంగా మారింది. అయితే మృతుల కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ సేకరించిన పోలీసులు ఆదిశగా కూపీ లాగుతున్నారు. గత వారం రోజులుగా వీళ్లు ముగ్గురూ రెగ్యులర్ గా కాల్స్ చేసుకోవడంతో పాటు ఎక్కువ సేపు చాటింగ్ చేసుకున్నట్లుగా తేలింది. అయితే వాళ్ల మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది అనే దాని ఆధారంగా కేసు విచారణ జరపనున్నారు. త్వరలో అన్ని వివరాలు తెలుపుతామని, ప్రస్తుతం కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Posts
ఉమ్మడి వరంగల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి వరంగల్ ఎంపీలు ఎమ్మెల్యేలు

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఉమ్మడి వరంగల్ జిల్లా Read more

తాండూరు గిరిజన వసతిగృహంలో భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థినిలు
Female students fell ill af

వికారాబాద్ జిల్లా తాండూరులోని వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థినిలు అనుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సాయిపూర్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ Read more

ఓనర్ కి తెలియకుండా ఇంటిపై రూ. కోటి లోన్
Thief 1cr loan

ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మోసాల్లోనే ఇది నెక్స్ట్ లెవల్ మోసం అనుకోవచ్చు. ఎందుకంటే ఓనర్‌కు తెలియకుండా ఓ దళారి ఇంటిపై రూ. Read more

టన్నెల్ లో గల్లంతైన వారి ఆనవాళ్లను గుర్తించిన జాగిలాలు
టన్నెల్ లో గల్లంతైన వారి ఆనవాళ్లను గుర్తించిన జాగిలాలు

(SLBC) టన్నెల్ కూలిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతుండడం, ఈ నేపథ్యంలో వారి ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా కేరళ నుంచి జాగిలాలు తెప్పించిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *