స్టార్‌లింక్ ఎంట్రీ అంత ఈజీ కాదు..నిబంధనలు పాటించాలి

ఎలాన్‌ మస్క్‌ మరో రికార్డ్


ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఎలాన్‌ మస్క్‌ నిత్యం వార్తలో నిలుస్తున్నాడు. తాజాగా తన వ్యక్తిగత సంపాదనలో 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరి రికార్డ్ సృష్టిచాడు. దీనికి సంబందించిన వివరాలు.. మ‌స్క్ సంపాద‌న 439.2 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్ సూచీ వెల్ల‌దించింది. స్పేస్‌ ఎక్స్‌ లోని అంతర్గత వాటా విక్రయంతో దాదాపు 50 బిలియన్‌ డాలర్లు పెరిగిన సంపాద‌న‌ అమెరికా ఎన్నికల ఫలితాల త‌ర్వాత మ‌స్క్ సంపాద‌న‌కు ఒక్క‌సారిగా రెక్క‌లు వచ్చాయి. ట్రంప్‌ విజయం అనంతరం టెస్లా స్టాక్స్‌ దాదాపు 65 శాతం పెరిగిన వైనంస్పేస్‌ ఎక్స్‌,టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ వ్యక్తిగత సంపాదనలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్‌ లోకి చేరారు.

Advertisements

ప్రపంచంలో ఇంతవరకు ఇంత సంపాదించిన వ్యక్తి మరొకరు లేరు. తాజాగా స్పేస్‌ ఎక్స్‌ లోని అంతర్గత వాటా విక్రయంతో ఆయన సంపాదన దాదాపు 50 బిలియన్‌ డాలర్లు పెరిగి 439.2 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్ సూచీ వెల్ల‌డించింది. 2022 చివ‌ర‌లో మ‌స్క్ సంపాద‌న నిక‌ర విలువ‌ 200 బిలియన్‌ డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ఫలితాల త‌ర్వాత మ‌స్క్ సంపాద‌న‌కు ఒక్క‌సారిగా రెక్క‌లొచ్చాయి. ట్రంప్‌ విజయం అనంతరం టెస్లా స్టాక్స్‌ దాదాపు 65 శాతం పెరిగాయి. దీంతో మస్క్‌ సంపాదన రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇక ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి అత్యధిక విరాళాలు ఇచ్చిన మస్క్‌.. ట్రంప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. దాంతో ట్రంప్‌ తన మంత్రివ‌ర్గంలో మస్క్‌ కు కీలక పదవి కూడా ఇచ్చారు.
మార్పులు తధ్యం?
అలాగే ట్రంప్‌ విజయంతో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను క్రమబద్ధీకరిస్తారని, టెస్లా పోటీదారులకు మేలు చేసే ఎలక్ట్రిక్‌ వాహనాలపై టాక్స్‌ క్రెడిట్‌ లను ఆయ‌న‌ తొలగిస్తార‌ని మార్కెట్‌ వర్గాలు అంచ‌నా వేస్తున్నాయని బ్లూమ్‌ బర్గ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే టెస్లా స్టాక్స్‌ విపరీతంగా పెరుగుతున్నాయి.
మస్క్‌ కు చెందిన ఆర్టిఫిషియల్‌ స్టార్టప్‌ ఎక్స్‌ ఏఐ గత మే నుంచి నిధుల సేకరణ ప్రారంభించింది. దీంతో దాని విలువ రెండింతలై 50 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఇటీవల స్పేస్‌ ఎక్స్‌, దాని పెట్టుబడిదారులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. త‌ద్వారా 1.25 బిలియన్‌ డాలర్ల విలువ గల షేర్లను స్పేస్‌ ఎక్స్‌ ఉద్యోగులు, కంపెనీ ఇన్‌ సైడర్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో స్పేస్‌ ఎక్స్‌ 350 బిలియన్‌ డాలర్ల విలువకు చేరి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్‌ స్టార్టప్‌గా స్పేస్‌ ఎక్స్‌ రికార్డు సృష్టించింది. ఇక స్పేస్‌ ఎక్స్‌ ఆదాయంలో ఎక్కువ శాతం అమెరికా ప్రభుత్వం ఒప్పందాల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ట్రంప్ పదవీకాలంలో కంపెనీకి భారీ మ‌ద్ద‌తు ల‌భించే అవకాశం ఉంది.

Related Posts
నైజీరియాలో క్రిస్మస్ వేడుకలో విషాదం: 35 పిల్లలు మృతి
nigeria

నైజీరియాలోని ఐబాదాన్ నగరంలో జరిగిన క్రిస్మస్ ఫెయిర్‌లో 35 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర సంఘటన 19 డిసెంబరున జరిగింది. ఎలాంటి అనుకోని పరిస్థితుల్లో, Read more

జర్మనీలో క్రిస్మస్ మార్కెట్ దాడిలో 7 భారతీయులు గాయపడ్డారు..
german christmas market attack

జర్మనీకి చెందిన మాగ్డెబర్గ్‌లో జరిగిన క్రిస్మస్ మార్కెట్ దాడిలో 7 భారతీయులు గాయపడ్డారు. ఈ దాడి జరిగిన తర్వాత, మూడు భారతీయులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. Read more

ట్రాన్స్‌జెండర్ సేవలపై పెంటగాన్ కొత్త విధానం
ట్రాన్స్‌జెండర్ సేవలపై పెంటగాన్ కొత్త విధానం

పెంటగాన్ తాజాగా తన ట్రాన్స్‌జెండర్ ట్రూప్ పాలసీ గురించి కోర్టులో వివరాలు వెల్లడించింది. ఈ విధానం ప్రకారం, లింగ డిస్ఫోరియాతో బాధపడే వ్యక్తులు లేదా లింగ మార్పిడి Read more

ఆస్ట్రేలియాకు వెళ్లిన స్టూడెంట్స్ వీసాలు రద్దు.. ఎందుకంటే?
student visas to Australia

అమెరికాలో విద్యార్థుల కోసం పార్ట్ టైమ్ ఉద్యోగాలకు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పరిస్థితి ఆస్ట్రేలియాలో కూడా కొనసాగుతోంది. విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ Read more

×