Notices to MLC Pochampally Srinivas Reddy

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు

హైదరాబాద్: ఫామ్‌హౌస్‌ లో కోడిపందాల కేసు లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి మొయినబాద్ పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మాదాపూర్‌లో ఉంటున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోలీసులు ఈ మేరకు నోటిసులు అంటించారు. కాగా ఫామ్‌హౌస్‌లో కోడిపందాల కేసులో మొదటిసారి నోటీసులు అందుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫిబ్రవరి 17న పోలీసులకు వివరణ ఇచ్చారు. కోడి పందాలు జరిగిన ఫామ్ హౌస్ ఎమ్మెల్సీది కావడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి

కోడి పందాలు ఆడించిన ఫామ్ హౌస్ తనదే

వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని, అలాగే ఫామ్‌హౌస్‌కు సంబంధించి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. దీంతో న్యాయవాదితో కలిసి వచ్చిన ఎమ్మెల్సీ.. మొయినాబాద్ పోలీసులకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. కోడి పందాలు ఆడించిన ఫామ్ హౌస్ తనదేనని 2023 వర్రా రమేష్ కుమార్ రెడ్డికి లీజ్‌కు ఇచ్చినట్లు పోచంపల్లి పేర్కొన్నారు. రమేష్ కుమార్‌తో పాటు మరొకరి కూడా లీజ్‌కు ఇచ్చినట్లు వెల్లడించారు. లీజ్ పత్రాలను కూడా పోలీసులకు పోచంపల్లి అందజేశారు.

రెండు మూడు సార్లు పెద్దఎత్తన కోడిపందాలు

లీజ్‌కు ఇచ్చిన భూమిని ఏపీకి చెందిన వ్యాపారి భూపతి రాజు శివ కుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కోడి పందాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. కాగా.. భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ అనే వ్యక్తి అదే ఫామ్‌హౌస్‌‌లో రెండు మూడు సార్లు పెద్దఎత్తన కోడిపందాలు, క్యాసినోలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇటీవల మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో మరోసారి కోడిపందాలు నిర్వహించాడు. సంక్రాంతి పండగ తర్వాత మిగిలిన కోళ్లను ఫామ్‌హౌస్‌కు తీసుకువచ్చి కోడిపందేలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

Related Posts
భారీగా కోడి పందేల ఏర్పాట్లు
kodi pandalu

సంక్రాంతి పండుగ సీజన్ వస్తే చాలు ఆంధ్రప్రదేశ్ లో కోడి పందేల జోరు కొనసాగుతుంది. కోట్లాది రూపాయలు ఈ పందేరంలో పెడతారు. సంక్రాంతి పండుగ వేళ కోడి Read more

పాకిస్థాన్‌ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌
India reacts strongly to Pakistan accusations

మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో పాక్‌ లేదు.. జెనీవా : దాయాది దేశం మరోసారి అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై తన అక్కసు వెల్లగక్కింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం Read more

ఏపీ మందుబాబులకు మరో శుభవార్త
Another good news for AP dr

ఏపీ మందుబాబులకు సర్కార్ వరుస గుడ్ న్యూస్ ను అందజేస్తూ కిక్ ను పెంచేస్తుంది. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ.99కే మద్యం అమ్మించాలని ప్రయత్నిస్తున్నట్లు Read more

అమెరికా నుంచి మరో వలసదారుల విమానం?
Another migrant flight us

మొత్తం 487 మంది అక్రమ వలసదారులను అమెరికా నుండి పంపించనున్నట్లు సమాచారం అమెరికా నుంచి అక్రమ వలసవెళ్లిన వారితో కూడిన రెండవ విమానం ఈ నెల 15న Read more