police van

ఎమ్మెల్సీ కవిత మామఫై కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయింది.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌లోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ ఎదుట ఉన్న స్థలం విషయంలో రామ్ కిషన్ రావుకు, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ కు మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తున్నది
. ఈ వ్యవహారంలో నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయని ఎస్‌హెచ్‌వో మహమ్మద్‌ ఆరీఫ్‌ వెల్లడించారు.
ఆరోపణలు నిజం కాదు
ఇదిలా ఉండగా, ఇదే స్థలం తమదంటూ మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ వాదిస్తున్నారు. తాము రోడ్డు స్థలాన్ని కబ్జా చేశామంటూ తమపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, అది తన సొంత స్థలం అని నగేశ్‌ కుమార్‌ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పోలీస్ స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఈ స్థలంతో రామ్‌కిషన్‌ రావుకు అసలు సంబంధమే లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నగేశ్‌ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామ్ కిషన్ రావు, అపార్ట్‌మెంట్‌ వాసి గోపితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లిక్కర్ స్కాములో నిందితురాలిగా వున్న కవిత ప్రస్తుతం బెయిల్ ఫై వున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కేసు ప్రాదాన్యత సంతరించుకుంది. కాగా, ఆర్‌కేఆర్‌ అపార్ట్‌మెంటు ఎదుట ఉన్న రోడ్డు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తాము అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడ్డారంటూ సదరు అపార్ట్‌మెంట్ వాసి గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తమను కులం పేరుతో దూషించారని, అంతు చూస్తానంటూ కిషన్ రావు అనుచరులు బెదిరించి దాడికి పాల్పడ్డారని వివరించారు. దీంతో రామ్‌కిషన్‌ రావు, మాజీ కార్పొరేటర్‌ భర్త సుదామ్‌ రామ్‌చంద్, నగేశ్, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Related Posts
తాజ్ బంజారా హోటల్‌కి షాక్: జీహెచ్ఎంసీ సీజ్
GHMC seizes Taj Banjara Hotel in Hyderabad

హైదరాబాద్‌లో తాజ్ బంజారా హోటల్ సీజ్ – రూ.1.43 కోట్ల పన్ను బకాయి హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ప్రముఖ హోటల్ తాజ్ బంజారా గణనీయమైన పన్ను Read more

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ: 17 వేల కొత్త ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ: 17 వేల కొత్త ఉద్యోగాలు

ఇన్ఫోసిస్, ఇప్పటికే హైదరాబాద్లో 35,000 మంది ఉద్యోగులతో కొనసాగుతూ, ఇప్పుడు 17,000 కొత్త ఉద్యోగాల సృష్టికి సిద్ధమవుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు హైదరాబాద్ లోని పోచారం ఐటీ Read more

తెలియని వ్యక్తులపై రంగు చల్లితే కఠిన చర్యలు -సీపీ
holi

హోలీ సందర్భంగా ప్రజలు మర్యాదపూర్వకంగా సంబరాలు జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. రోడ్డుపై వెళ్తున్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లడం పూర్తిగా నిషేధించబడిందని Read more

గత పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది..?: మంత్రి పొన్నం
unnamed file

హైదరాబాద్‌: మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేడు గాంధీ భవన్‌లో 'మంత్రులతో ముఖాముఖి' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత Read more