Attacks at the instigation of CM Revanth Reddy: MLC Kavitha

ఎమ్మెల్సీ క‌విత కాంగ్రెస్, బీజేపీలపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాంగ్రెస్, బీజేపీ ప్ర‌భుత్వాలు బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల అమ‌లు విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించాయ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. ఈ పార్టీలు ప్రజలకు సరైన పాలనను అందించడంలో విఫలమైనాయని కవిత విమర్శించారు. రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయ‌ని, నేను చెప్పిన‌వి త‌ప్ప‌యితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాని క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇందిరా పార్క్ వ‌ద్ద నిర్వ‌హించిన బీసీ మ‌హాస‌భ‌లో క‌విత పాల్గొని ప్ర‌సంగించారు.

Advertisements

ఈ దేశ మొదటి ప్రధాని నెహ్రూ కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారు. ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా..? మండల్ కమిషన్ మొరార్జీ దేశాయ్ నియమించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదు. మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది కానీ అమలు చేయలేదు. 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు..? మళ్లీ కాంగ్రెసేతర ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసింది. బీసీల కోసం పని చేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ కూలగొట్టింది అని క‌విత గుర్తు చేశారు.

కేసీఆర్, ఎన్టీఆర్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు మాత్రమే బీసీలకు న్యాయం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు జరిగిన లాభం ఏమిటో ఆలోచించాలి. సావిత్రీబాయి పూలే ఆడబిడ్డ కాదు… పులిబిడ్డ. మహిళా విద్యాకు ఎంతగానో కృషి చేశారు. ఎంతో మంది మహిళలకు చదువును నేర్పించారు సావిత్రీబాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమాజ వికాసం కోసం పని చేశారు అని క‌విత ప్ర‌శంసించారు.

Related Posts
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల ఆయన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదికను Read more

CM Revanth Reddy : పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదు.. సీఎం హెచ్చరిక
There is no peace if the party crosses the line.. CM warns

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం జరిగింది. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో.. ప్రధానంగా నాలుగు Read more

CM Revanth : సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం
cm revanth nov

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోవాటెల్ హోటల్‌లో ప్రమాదం తప్పింది. ఆయన హైదరాబాదులోని నోవాటెల్ హోటల్‌ను సందర్శించిన సందర్భంలో, అక్కడి లిఫ్ట్‌లో అనుకోని సాంకేతిక అంతరాయం ఏర్పడింది. Read more

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌..!
Strike siren in Telangana RTC..!

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె కు సైరన్ మోగించనున్నారు . ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు Read more

×