mlc kavitha

ఎన్ని కేసులు పెట్టినా భయపడం : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నది జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మా నాయకులను జైల్లో పెట్టడమే పనిగా పెట్టుకుందని ఆమె విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని, ప్రజల హక్కుల కోసం ప్రజల పక్షాన నిలబడి ప్రజా వాణిని వినిపిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కవిత ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. బోథ్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్, ఇతర బి.ఆర్.ఎస్ నాయకులు కవిత వెంట ఉన్నారు. భూమి కోసం భుక్తి కోసం పోరాడి అమరులైన వారి త్యాగాలను స్మరిస్తే ఉత్తేజం కలుగుతోందని అన్నారు. అదే స్పూర్తితో ప్రజా సమస్యలపై పోరాడుతామని అన్నారు.


రైతు భరోసాపై మాట తప్పింది
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వం మాట తప్పిందని, రైతులకు 15 వేల రూపాయల ఇస్తామని ఇప్పుడు 12 వేలకు తగ్గించి ముఖ్యమంత్రి రైతులను మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బిఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనలకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేస్తూ వేధిస్తోందని అన్నారు.

Related Posts
పోసాని బెయిల్ పిటిషన్ వాయిదా
పోసాని బెయిల్ పిటిషన్ వాయిదా

సినీ పరిశ్రమలో పాపులర్ అయిన నటుడు పోసాని కృష్ణమురళి ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. ఆయనపై ఉన్న వివిధ కేసుల్లో, ఆయన బెయిల్ పిటిషన్‌పై రైల్వే Read more

తెలంగాణలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్
తెలంగాణలో ఎమ్మెల్సీ నోటిఫికేషన్

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం, ఈ నెల 29న ముగియనున్న ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం నేపథ్యంలో Read more

ఆన్ లైన్ లోనూ జనరల్ టికెట్ అందుబాటు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు
ఆన్‌లైన్‌లో జనరల్ టికెట్ బుకింగ్! క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! జనరల్ టికెట్ కొనుగోలు కోసం ఇక స్టేషన్లలో గంటల తరబడి క్యూలో నిలబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని Read more

రేవంత్ సీఎం కావటం ప్రజల దురదృష్టం – కిషన్ కీలక వ్యాఖ్యలు
1629299 kishan reddy

తెలంగాణలో మెట్రో విస్తరణ ప్రాజెక్టు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మెట్రో విస్తరణను తాను Read more