ntr nxt movie

ఎన్టీఆర్ ‘డ్రాగన్‌’..?

దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్..ప్రస్తుతం హిందీలో ‘వార్‌-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హృతిక్‌రోషన్‌ మరో హీరోగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌పై పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రశాంత్‌నీల్‌ అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నారు.

Advertisements

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా టైటిల్‌ను సంక్రాంతి సందర్భంగా వెల్లడించనున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకు ‘డ్రాగన్‌’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. చిత్ర బృందం కూడా ఇదే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌ సస్పెన్స్‌ వీడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఫిబ్రవరి లేదా మార్చిలో షూటింగ్‌ మొదలుకానుందని సమాచారం.

ఇందులో ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ పై కొన్ని ఆసక్తికరమైన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రంలో తారక్‌ నెగటివ్‌రోల్‌లో కనిపిస్తాడని సమాచారం. డ్రాగన్‌ టైటిల్‌కి తగ్గట్టే ప్రశాంత్ నీల్‌ పాత్రను డిజైన్ చేశాడని టాక్‌. యూరోపియన్‌ కల్చర్‌లో చెడుకి సింబల్‌ డ్రాగన్‌. మైథాలజీలో ఓ రాక్షసుడు. డ్రాగన్‌కి అగ్గి పీల్చే గుణం వుంటుంది. అలాగే అలజడికి సింబాలిక్‌గా డ్రాగన్‌ ని వాడుతారు. ఇవన్నీ ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ లో ఉండేట్లు డిజైన్‌ చేస్తున్నారట డైరెక్టర్. టెంపర్ లో ఎలాగైతే ఎన్టీఆర్ పాత్ర ఉంటుందో..అదే తరహాలో ఈ మూవీ లో కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

Related Posts
‘ మట్కా ‘ నిర్మాతలకు , బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు
matka collections dijaster

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మట్కా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. దర్శకుడు కరుణ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ Read more

చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ ఎప్పుడంటే?
chiru anil

మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా Read more

Court Movie : నాలుగోవరోజు టోటల్ కలెక్షన్స్ ? Cr
Court Movie : నాలుగోవరోజు టోటల్ కలెక్షన్స్ ? Cr

కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ - తెలుగు సినిమా సమీక్ష నాలుగోవరోజు టోటల్ కలెక్షన్స్ 14.84 Cr 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ' 2025 Read more

చరణ్ పై మెగాస్టార్ ప్రశంసలు
chiru tweet

గేమ్ ఛేంజర్ మూవీ లో రామ్ చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో ప్రశంసలు కురిపించారు. 'నిజాయితీ కలిగిన అప్పన్నగా, ఐఏఎస్ అధికారి రామ్నందన్గా చరణ్ అద్భుతంగా Read more

×