CM Chandrababu launched the free gas cylinder scheme

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈరోజు ప్రారంభమైంది. దీపం 2 పథకంలోని భాగంగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈదుపురంలో మహిళా లబ్దిదారులలో ఒకటైన శాంతమ్మ ఇంటికి చంద్రబాబు వెళ్లి ఆమెకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించారు. అనంతరం జానకమ్మ అనే ఒంటరి మహిళకు పింఛన్ అందజేశారు. సీఎం తన ఇంటికి రావడంతో జానకమ్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

జానకమ్మ సీఎం చంద్రబాబుకు తన సొంత ఇల్లు కట్టించమని కోరారు. ఇందుకు సీఎం హామీ ఇచ్చి.. రేపటి నుంచే మీ ఇంటి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు కూడా దీనిపై ఆదేశాలు ఇచ్చారు. డ్వాక్రా కార్యక్రమంలో లీడర్‌గా ఉన్నావు కాబట్టి పది రూపాయలు సంపాదించుకోవాలి అని సీఎం జానకమ్మకు సలహా ఇచ్చారు. థైరాయిడ్, డయాబెటిక్ ఉన్న వారికి జనరిక్ మందులు అందుబాటులో ఉంటే చూడాలని కలెక్టర్‌ను సూచించారు. జానకమ్మ మాట్లాడుతూ.. “నేను రూ.500 నుంచి రూ.4000 వరకు అందుకుంటున్నాను. మీరు మాకు దేవుడు” అని సీఎం చంద్రబాబుకు తెలిపారు. 20 సంవత్సరాలుగా పేదరికంలో మగ్గుతున్నామని ఆమె చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ద్రబాబు ఆమెను ఓదార్చారు.

Related Posts
పుతిన్, జెలెన్‌స్కీతో ట్రంప్ చర్చలు
పుతిన్, జెలెన్‌స్కీతో ట్రంప్ చర్చలు

ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందడుగు వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. Read more

‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ 2024’
Freedom Healthy Cooking Oils to Honor Winners of 'Go for Freedom Gold Offer 2024' Bumper Draw

హైదరాబాద్‌ : దేశంలోని ప్రముఖ వంట నూనెల బ్రాండ్ అయిన ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ కోసం ‘గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ Read more

హైకోర్టులో పేర్నినానికి ఊరట
perni nani

ఏపీలో సంచలనం సృష్టించిన బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి పేర్నినాని Read more

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం
A huge fire broke out in Parawada Pharmacy

అనకాపల్లి : ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు Read more