vijayasai reddy

ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఈడీ ఆఫీసులో విచారణకు ఎంపీ హాజరయ్యారు. కాకినాడ సెజ్‌లో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారన్న కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హాయంలో కాకినాడ పోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ.3600 కోట్ల విలువైన షేర్లను కేవీరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ కేసు ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసింది. మనీలాండరింగ్‌ కోణంపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అప్పట్లో ఈడీ విచారణకు విజయసాయి హాజరుకాలేదు.

దీంతో తాజాగా మరోసారి ఎంపీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈరోజు విచారణకు రావాల్సింది ఈడీ నోటీసుల్లో పేర్కొంది. దీంతో విజయసాయిరెడ్డి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌ రెడ్డి, ‘అరబిందో’ డైరెక్టర్‌ శరత్‌చంద్రా రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆరోగ్యం బాగాలేనందున విచారణకు రాలేని విక్రాంత్‌రెడ్డి సమాచారం ఇచ్చారు.

Related Posts
రాహుల్​గాంధీ కులమేంటో చెప్పండి : రఘునందన్
Raghunandan Rao Sensational Comments On Rahul Gandhi

హైదరాబాద్‌: ప్రధాని మోడీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు స్పందించారు. మోడీ లీగల్లీ కన్వర్టెడ్​ బీసీ అని సీఎం వ్యాఖ్యానించారు. Read more

వికారాబాద్‌లో ముగ్గురు సీఐలు, 13మంది ఎస్‌ఐలు సస్పెన్షన్
three cis and 13 sis were suspended in vikarabad

three-cis-and-13-sis-were-suspended-in-vikarabad హైదరాబాద్: అక్రమాల్లో భాగం కావడం, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు పలువురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. తెలంగాణలో మల్టీజోన్-2లోని 9 జిల్లాల్లో అక్రమ ఇసుక Read more

ఈనెల 30 నుండి బీఆర్‌ఎస్‌ “గురుకుల బాట” కార్యక్రమం: కేటీఆర్‌
Will march across the state. KTR key announcement

హైదరాబాద్‌ : గురుకులాల్లో చోటు చేసుకుంటున్న వరుస విషాద ఘటనల నేపథ్యంలో ఈనెల 30 నుండి డిసెంబర్‌ ఏడో తేదీ వరకు బీఆర్ఎస్‌ పార్టీ తరపున "గురుకుల Read more

విజయసాయి రెడ్డి రాజీనామాకు కారణమేంటి?
Vijayasai Reddy quits polit

వైసీపీ పార్టీకి కీలక నేతగా పనిచేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ఈ సందర్భంగా అనేక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *