talliki vandanam

ఇప్పట్లో తల్లికి వందనం లేనట్టేనా!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లికి వందనం పథకం అమలు ఇప్పట్లో లేదని తెలుస్తున్నది. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కారణం.. తల్లికి వందనం పథకాన్ని ఈ సంవత్సరం అమలు చెయ్యట్లేదనే వార్త బయటకు రావడమే. దీన్ని 2025 విద్యా సంవత్సరం నుంచి అమలు చెయ్యాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అంటే.. 2025 జూన్‌లో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. మరి 2024 విద్యా సంవత్సరం సంగతేంటి? ఈ విద్యా సంవత్సరానికి ఇవ్వాల్సిన డబ్బు సంగతేంటి? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

అప్పులు చేసిన తల్లిదండ్రులు
తల్లికి వందనం పథకం కింద.. ప్రతీ విద్యార్థికీ రూ.15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక, మొదటి ఆర్థిక లేదా విద్యా సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చెయ్యట్లేదని తెలుస్తోంది. ఈ పథకం అమలవుతుందనే ఆలోచనతో.. చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లల స్కూళ్ల ఫీజుల కోసం అప్పులు చేశారు.
వైసీపీ ప్రభుత్వం కూడా కాలయాపన
గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేసింది. ఎన్నికల ఏడాదిలో… అప్పటి సీఎం జగన్.. చివరి ఏడాది ఇవ్వాల్సిన అమ్మఒడి డబ్బు ఇవ్వలేదు. అలాగే కాలయాపన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో.. డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టారు.

ఆ విద్యా సంవత్సరం కూడా తల్లిదండ్రులు అప్పులు చేసి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మనీ ఇవ్వకపోవడంతో.. రెండోసారి మళ్లీ అప్పులు చేసి, ఫీజులు కడుతున్నారు.
పోటి రాజకీయాలతో ప్రజలకు ఇబ్బంది
గత ప్రభుత్వంలో జగన్.. ఒక బిడ్డ చదువుకే రూ.13,000 చొప్పున ఇస్తూ వచ్చారు. ఐతే.. అందులో రూ.2,000 కోత పెట్టి.. ఆ డబ్బును స్కూళ్లలో పారిశుధ్యం కోసం వాడారు. ఇలా మూడేళ్లు ఇచ్చారు. తర్వాత ఎన్నికలు ఏడాదిలో ఇవ్వకుండా తాత్సారం చేసి.. చివరకు ఊరుకున్నారు.

Related Posts
ఆంధ్రాలో వేలల్లో ఉద్యోగావకాశాలు
chandrababu naidu

ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో రూ.14,000 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ Read more

సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు: సీఎం చంద్రబాబు
Roads without potholes in the state by Sankranti. CM Chandrababu

అమరావతి: సీఎం చంద్రబాబు పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతల రోడ్లు నరకానికి రహదారులు అని.. రోడ్ల Read more

తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠా ఆ వ్యక్తులు – పట్టాభి
pattabhi jagan

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. జగన్-షర్మిల ఆస్తుల పంపకం వివాదంపై స్పందించారు. జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తుందని, తాడేపల్లి ఇంటికి విధేయంగా పనిచేస్తున్న Read more

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు – వంశీ అనుచరులు అరెస్ట్
Gannavaram TDP office attack case

విజయవాడ: గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *