Border Gavaskar Trophy

ఇదెక్కడి మ్యాచ్ భయ్యా 2 డబుల్స్ సెంచరీలు

డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా టెస్ట్ క్రికెట్ అభిమానులకు మూడు ఆసక్తికర మ్యాచ్‌లు కిక్కిరిసిన క్షణాలను అందించాయి. మెల్‌బోర్న్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ ప్రారంభమవగా,మరో రెండు టెస్ట్ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా-పాకిస్తాన్, జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగాయి.ఈ మ్యాచ్‌లన్నీ తమదైన ప్రత్యేకతలతో క్రికెట్ ప్రియులకు మధురానుభూతిని మిగిల్చాయి.దక్షిణాఫ్రికా,పాకిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి నాలుగో రోజు ముగిసింది. రెండు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించి తమ ప్రతిభను చాటింది.అయితే, అదే రోజు ప్రారంభమైన భారత్-ఆస్ట్రేలియా టెస్ట్, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది.డిసెంబర్ 30న మెల్‌బోర్న్ టెస్ట్ ముగిసింది. 184 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది.

Border Gavaskar Trophy
Border Gavaskar Trophy

ఈ పరాజయం భారత జట్టుకు నిరాశనిచ్చినప్పటికీ, క్రికెట్ అభిమానులను మరో మ్యాచ్ విశేషాలు ఉత్కంఠపరిచాయి.జింబాబ్వే,ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌ పరస్పర పోటీతత్వాన్ని ప్రదర్శించింది. 90వ దశకానికి చెందిన టెస్ట్ మ్యాచ్‌లను తలపించేలా భారీ స్కోర్లతో, ఉత్కంఠభరిత క్షణాలతో ఈ మ్యాచ్ సాగింది. మొత్తం ఐదు రోజుల్లో ఆరు సెంచరీలు నమోదవడం విశేషం. 1586 పరుగులతో పాటు 24 వికెట్లు పడగొట్టిన ఈ మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది.తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే, 586 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

షాన్ విలియమ్స్ 154 పరుగులు చేసి జట్టు విజయం వైపు నడిపించారు.అతనికి బ్రియాన్ బెన్నెట్ (110) మరియు కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (104) బలమైన మద్దతు అందించారు.బెన్ కర్రాన్ 68 పరుగులతో మెరిసి జట్టుకు స్థిరమైన మద్దతు ఇచ్చాడు. జింబాబ్వే తరపున కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే రెండంకెల స్కోర్‌కు ముందు ఔటయ్యారు. అఫ్ఘాన్ బౌలర్ అల్లా గజన్‌ఫర్ మూడు వికెట్లు తీశారు.ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్‌లో రెండు డబుల్ సెంచరీలు ఆసక్తి రేపాయి. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 246 పరుగులు చేయగా,రహ్మత్ షా 234 పరుగులతో అదరగొట్టారు. వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్ 113 పరుగులతో ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు.

Related Posts
ఇంగ్లాండ్ పై అరంగేట్రం చేసే ఛాన్స్..ఎవరికంటే?
ఇంగ్లాండ్ పై అరంగేట్రం చేసే ఛాన్స్..ఎవరికంటే

భారత క్రికెట్ జట్టు ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడేందుకు సిద్ధమైంది ఈ సిరీస్ కోసం నాగ్‌పూర్‌లో జరుగుతున్న షార్ట్ క్యాంప్‌లో వరుణ్ చక్రవర్తి Read more

అక్షర్ పటేల్ బుల్లెట్ త్రో రెప్పపాటులో రనౌట్!
అక్షర్ పటేల్ బుల్లెట్ త్రో రెప్పపాటులో రనౌట్!

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్‌కి పండుగ. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ హై-వోల్టేజ్ సమరం అంచనాలను అందుకుంటోంది. మ్యాచ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే అద్భుతమైన మోమెంట్స్ Read more

Ben Stokes;త‌న‌కు ఎంతో సెంటిమెంట్ అయిన వ‌స్తువులు పట్టుకెళ్లార‌ని స్టోక్స్ ఆవేద‌న‌?
skysports pa ben stokes england 5805019

ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో ఇటీవల దొంగతనం చోటుచేసుకుంది పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఈ ఘటన గురించి స్టోక్స్ తాజాగా వెల్లడించారు Read more

Kagiso Rabada: టెస్టు క్రికెట్‌లో రబాడ అరుదైన ఘనత… తొలి బౌలర్​గా రికార్డ్​!
Kagiso Rabada

దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసొ రబాడ ఒక అద్భుతమైన ఘనతను సాధించాడు టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 300 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా తనను Read more