Congress MLA Medipalli Saty

ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో అపశృతి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్న సమయంలో, తెలంగాణలోని కరీంగనర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద జరిగిన ఒక ఘటన ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసే క్రమంలో, విగ్రహానికి ఏర్పాటు చేసిన గద్దె కూలిపోవడంతో ఆయన కిందపడ్డారు.

ఈ ఘటనతో అక్కడున్న కార్యకర్తలు వెంటనే ఎమ్మెల్యేకి సహాయం చేశారు. “నాకు ఏమి కాలేదని” ఎమ్మెల్యే సత్యం చెప్పడంతో, అందరూ కాస్త కుదుటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కొంతమంది నెటిజన్లు “గద్దెను సరిగా కట్టలేదని, చూసుకోవాలి” అని కామెంట్లు చేస్తూ, అధికారులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనకుండా ఉండాలనే సూచిస్తున్నారు. ఈ సంఘటన, ప్రజలలో ఈవెంట్ల నిర్వహణపై చర్చకు దారితీసింది.

Related Posts
నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ మేరకు Read more

తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌లకు దక్కని ఊరట
IAS officers did not get relief in the high court

హైదరాబాద్‌: క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే వీరి పిటిషన్లపై బుధవారం మధ్యాహ్నం కోర్టు Read more

SLBC ప్రమాదం : ఆ 8 మంది చనిపోయి ఉంటారు – అధికారులు
కష్టంగా కొనసాగుతున్నరెస్క్యూ ఆపరేషన్

తెలంగాణలోని ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలపై అధికారులు ఆశలు వదులుకున్నారు. వీరు టన్నెల్‌లో పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా భూకంపం Read more

తెలంగాణ కొత్త సీఎస్ ఎవరో..?
telangana cs santhakumari

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత చీఫ్ సెక్రటరీ (సీఎస్) శాంతి కుమారి పదవీ కాలం ఏప్రిల్ 7న ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త సీఎస్ ఎవరు Read more