farooq abdullah

‘ఇండియా’ ఎన్నికల్లో పోటీ కోసం కాదు: ఫరూక్ అబ్దుల్లా

ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌ శాశ్వతమని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. ఈ కూటమి కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాదని తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయడం, ద్వేషాన్ని తొలగించడం కోసమని చెప్పారు. ఈ కూటమి కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాదని తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయడం, ద్వేషాన్ని తొలగించడం కోసమని చెప్పారు. ‘ఇండియా’ బ్లాక్‌లో భాగమైన ఆప్‌, కాంగ్రెస్‌ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం తలపడుతున్నాయి.

ఈ కూటమికి చెందిన టీఎంసీ, శివసేన (యూబీటీ) వంటి పార్టీలు ఆప్‌కు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి ఐక్యత, మనుగడపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే అయితే ఈ కూటమిని ముగించవచ్చని ఫరూక్‌ అబ్దుల్లా కుమారుడు, జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా గురువారం సూచించారు.
కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి భవిష్యత్తు గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఫరూక్ అబ్దుల్లా సమాధానమిచ్చారు. ఈ కూటమి కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కాదని తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయడం, ద్వేషాన్ని తొలగించడం కోసమని చెప్పారు. ‘ఈ కూటమి శాశ్వతం. ఇది ప్రతి రోజు, ప్రతి క్షణానికి సంబంధించినది’ అని అన్నారు. అయితే ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంతో పోరాటం చేయదని తెలిపారు. జమ్ముకశ్మీర్‌ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.

Related Posts
బీజేపీకి అభినందనలు తెలిపిన కేజీవాల్
aravind tweet

ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ఆశలతో కమలం పార్టీకి ప్రజలు గెలుపును అందించారని, Read more

India-Pakistan: పాక్ పై మండి పడ్డ భారత్
India-Pakistan: పాక్ పై మండి పడ్డ భారత్

భారత్ పై పాకిస్థాన్ కుట్రలు: అంతర్జాతీయ వేదికలో మరోసారి దెబ్బతిన్న దాయాది అంతర్జాతీయ వేదికలో భారత్ పై ఆరోపణలు చేసి తమ ఉనికి నిరూపించుకోవాలనుకున్న పాకిస్థాన్ కు Read more

ఆ ఒక్క కోరిక తీరకుండానే చనిపోయిన రతన్ టాటా
Who will own Ratan Tatas p

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి Read more

అదానీ 4000 కోట్లతో ఎయిర్ వర్క్స్ కొనుగోలు
అదానీ 4000 కోట్లతో ఎయిర్ వర్క్స్ కొనుగోలు

అదానీ గ్రూప్ ఎయిర్ వర్క్స్‌ను 4000 కోట్లకు కొనుగోలు చేసింది గౌతమ్ అదానీ మరో భారీ వ్యూహాత్మక దశను అనుసరించారు. అదానీ గ్రూప్, ఎయిర్ వర్క్స్ అనే Read more