ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్న చరణ్

ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్న చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన చిత్రం గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో తన జీవితానికి, సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో, ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసి, ఇప్పుడు నాలుగో సీజన్‌లో అడుగు పెట్టింది.

ram charan mahesh prabhas
ram charan mahesh prabhas

తొమ్మిదో ఎపిసోడ్‌కు ప్రత్యేక అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు. చరణ్‌తో పాటు హీరో శర్వానంద్, నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు.ఈ షో ప్రోమో తాజాగా విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాలయ్య తన శైలిలో చరణ్‌ను ఆసక్తికర ప్రశ్నలతో ఇరుకున పెట్టడం, చరణ్ ఆ ప్రశ్నలకు కూల్‌గా సమాధానమివ్వడం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ టాక్ షోలో బాలయ్య రామ్ చరణ్‌ను సామ్, కియారా, అలియాల్లో ఎవరు ఉత్తమ నటి అని ప్రశ్నించారు.

దీనికి సమంత అని సమాధానమిచ్చాడు చరణ్. అంతే కాకుండా, మహేష్ బాబు మరియు ప్రభాస్ ఇద్దరిలో ఒకరితో మల్టీస్టారర్ చేసే అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటారనే ప్రశ్నకు, మహేష్ బాబు అని చెప్పారు.ఇక, ప్రభాస్‌తో తన స్నేహంపై కూడా చరణ్ హుందాగా మాట్లాడాడు. గతంలో ప్రభాస్ ఈ షోలో వచ్చినప్పుడు రామ్ చరణ్‌కు కాల్ చేశాడని గుర్తు చేస్తూ, ఈసారి చరణ్ కూడా ప్రభాస్‌కు కాల్ చేసి మాట్లాడాడు.రామ్ చరణ్ తన కుమార్తె క్లింకార గురించి ఎంతో భావోద్వేగంగా మాట్లాడాడు. “అవును, నా కూతురు నన్ను ‘నాన్న’ అని పిలిచినప్పుడు నా ఫోటోను బయటపెడతాను” అని చెప్పాడు.

Related Posts
కాబోయే భర్త గురించి నిజాలు బయటపెట్టిన హీరోయిన్..
amritha Aaiyer

అమృత అయ్యర్. ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన నటి.మొదట్లో సైడ్ క్యారెక్టర్లతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ, ఇప్పుడు కథానాయికగా చక్కగా Read more

సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు మంచు విష్ణు కీలక ప్రకటన
manchu vishnu

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు మంచు విష్ణు ఇటీవల సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. తాజా ఘటనల నేపథ్యంలో, ప్రత్యేకంగా సంధ్య Read more

Mad Square: అదిరిపోయే ఎంట‌ర్‌టైన్మెంట్‌తో ‘మ్యాడ్ స్క్వేర్’ టీజ‌ర్ విడుదల
Mad Square' టీజర్ పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌తో అదిరిపోయిన విజువల్స్

'మ్యాడ్' సీక్వెల్‌గా వస్తున్న 'మ్యాడ్ స్క్వేర్' టీజ‌ర్ విడుదల మార్చి 29న థియేటర్స్‌లో సందడి చేయనున్న సినిమా 2023లో వ‌చ్చిన 'మ్యాడ్' మూవీకి సీక్వెల్‌గా వ‌స్తున్న 'మ్యాడ్ Read more

ఖతర్నాక్ డైరెక్టర్స్ ఆన్ ట్రాక్..చిరంజీవి
ఖతర్నాక్ డైరెక్టర్స్ ఆన్ ట్రాక్..చిరంజీవి

చిరంజీవి ఇప్పుడు తన సినిమాలు, పాత్రలు ఎలాగైతే నిర్ణయించుకుంటున్నాడో, అదే విధంగా యువ హీరోల రీతిలో ఆలోచిస్తుండటంతో, అభిమానులే కాదు సినీ పరిశ్రమ కూడా ఆశ్చర్యపడుతోంది. ప్రస్తుతం, Read more