Y S Sharmila

ఆ పార్టీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నాయి: షర్మిల

జనసేన, టీడీపీ పార్టీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నాయి, ఆ పార్టీల వాళ్ళ ప్రజలకు జరిగిన మేలు ఏమి లేదని షర్మిల విమర్శలు చేసారు. కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. 243 మంది పని చేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి… 26 వేల మంది పని చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడానికి మాత్రం మనసు రావడం లేదని దుయ్యబట్టారు. ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీఎస్ రూ. 15 వేల కోట్ల నిధులు రాబట్టిందని… కేంద్రంలోని ఎన్డీయేకు ఊపిరి పోసిన టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం కేంద్రానికి గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు.
ఉద్యమాలు కనిపించడం లేదా
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని కోరుతూ 1,400 రోజులుగా కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే సీఎం చంద్రబాబు మాత్రం ప్రధానితో మిట్టల్ స్టీల్ గురించి చర్చిస్తున్నారని షర్మిల విమర్శించారు. మిట్టల్ పెట్టబోయే ప్లాంట్ కు ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడాలని కోరుతున్నారని… ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు.

Related Posts
పవన్ భద్రతపై విచారణ చేస్తున్నాము : డీజీపీ
dgp ap

డిప్యూటీ సీఎం పవన్ భద్రత అంశాన్ని సీరియస్‌గా విచారణ చేస్తున్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు. పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగిరిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్‌గా Read more

కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను సీజ్ చేసిన అధికారులు
Officials seized the Stella ship at Kakinada port

అమరావతి: కాకినాడ పోర్టులో స్టెల్లాషిప్‌ను అధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ తనిఖీల తర్వాత కదిలిన అధికార యంత్రాంగం..కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్ చేసింది. Read more

తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డ్డ‌వారికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం
Vaikuntha Darshan for those injured in the stampede

తిరుపతి: తిరుప‌తిలో వైకుంఠ ఏకాద‌శి ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల జారీ స‌మ‌యంలో జ‌రిగిన తొక్కిస‌లాటలో ఆరుగురు మృతిచెంద‌గా, అనేక మంది గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈరోజు Read more

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన గురుకుల సిబ్బంది
Gurukula staff met Deputy Chief Minister Pawan Kalyan

అమరావతి : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, గెస్ట్ లెక్చరర్లు మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *