ind vs aus

ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో నితీష్ రెడ్డి శతకం భారత్‌కు కొత్త ఊపును అందించింది.ఓ దశలో ఫాలో ఆన్ ఒత్తిడిలో ఉన్న భారత జట్టును, కేవలం 116 పరుగుల తేడాతో నిలిపి మ్యాచ్‌లో నిలబడేలా చేశాడు.మూడో రోజు ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది.నితీష్ రెడ్డి 105 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు, అతనికి మహ్మద్ సిరాజ్ 2 పరుగులతో తోడుగా ఉన్నాడు.తొలి సెంచరీని సాధించిన నితీష్, భారత జట్టును మ్యాచ్‌లో నిలిపాడు.మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో, ఈ టెస్ట్ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం భారత జట్టు 164/5 స్కోరుతో ఆటను కొనసాగించింది. రిషబ్ పంత్ 6 పరుగులు,రవీంద్ర జడేజా 4 పరుగులతో జట్టును ముందుకు నడిపారు.అయితే, ఆస్ట్రేలియా బౌలర్లు తమ ప్రతిభను చాటారు. మొదటి సెషన్‌లో రిషబ్ పంత్ 28 పరుగుల వద్ద ఔటవ్వగా,రవీంద్ర జడేజా 17 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఈ దశలో భారత జట్టు 221/7 స్కోరుతో నిలిచింది.

Advertisements

కానీ, ఇక్కడి నుంచి నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కలిసి మ్యాచ్‌ను మరింత గాడిలో పెట్టారు. నితీష్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఎనిమిదో వికెట్‌కు 285 బంతుల్లో 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇన్నింగ్స్‌ ద్వారా ఫాలో ఆన్‌ను తప్పించడంతో పాటు జట్టును గౌరవప్రద స్థితిలో నిలిపారు. వాషింగ్టన్ సుందర్ 162 బంతుల్లో 50 పరుగులు చేయగా,చివరికి ఆయన ఔటయ్యాడు.ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ తలో మూడు వికెట్లు తీశారు.నాథన్ లియాన్ రెండు కీలక వికెట్లు తీసి భారత్‌పై ఒత్తిడిని పెంచాడు. కానీ,నితీష్ రెడ్డి సూపర్ ఇన్నింగ్స్,సుందర్ సహకారం ఫాలో ఆన్ బెడదను దూరం చేసింది.డిసెంబరు 27న ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 474 పరుగుల వద్ద ముగించింది.

Related Posts
లండన్ నైట్స్ గ్వెల్ఫ్ స్టార్మ్‌ను 6-0తో ఓడించి.?
లండన్ నైట్స్ గ్వెల్ఫ్ స్టార్మ్ను

జనవరి 17న, కెనడా లైఫ్ ప్లేస్‌లో లండన్ నైట్స్ గ్వెల్ఫ్ స్టార్మ్‌ను 6-0తో ఓడించి, ఆంటారియో హాకీ లీగ్‌లో తన స్థానం తిరిగి మొదటి స్థానంలోకి తీసుకెళ్లింది. Read more

డబుల్ సెంచరీ చెలరేగిన ధోని మాజీ టీంమేట్..
ms dhoni

దేశవాళీ అండర్-23 వన్డే టోర్నీలో ఉత్తరప్రదేశ్ జట్టు 407 పరుగుల కఠిన లక్ష్యాన్ని ఛేదించి అద్భుతమైన విజయం సాధించింది.ఈ ఘన విజయానికి ఉత్తరప్రదేశ్ జట్టు కెప్టెన్ సమీర్ Read more

రోహిత్ వీడ్కోలపై ఊహాగానాలు
రోహిత్ వీడ్కోలపై ఊహాగానాలు

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆయా జట్లు నిష్క్రమించిన వెంటనే పలువురు క్రికెటర్లు వన్డేలకు వీడ్కోలు ప్రకటిస్తున్నారు. ఆ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, బంగ్లాదేశ్ వికెట్ Read more

పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ
final match of champions tr

29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ మెగాటోర్నీకి అతిథ్యమిచ్చిన పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ను లాహోర్‌లో నిర్వహించాలనుకున్నప్పటికీ, తాజా పరిణామాలతో ఆ Read more

×