r krishnaiah

ఆర్.కృష్ణయ్య కొత్త పార్టీ..?

పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన బీసీల సమరభేరి మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలందరికీ సమాన వాటా ఉండాలని అన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం అవసరమైతే పొలిటికల్ పార్టీ పెట్టేందుకు సిద్ధం అవుతామని స్పష్టం చేసారు.

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి వారికి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనగణనతోపాటు కులగణనా చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. సోమవారం రవీంద్రభారతిలో బీసీల సమరభేరి మహాసభ జరిగింది. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో బీసీలందరికీ సమాన వాటా లభించాలని, బీసీల రాజ్యాధికారం కోసం అవసరమైతే రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతామన్నారు.

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటుపడాలని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం అమలు చేసే బీసీ రిజర్వేషన్లను 27 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు.

Related Posts
TTDలో ప్రక్షాళన చేస్తాం – BR నాయుడు
BR Naidu

TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్‌గా నియమితులైన బొల్లినేని రాజగోపాల్ నాయుడు, తన నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ Read more

కుంభమేళాలో తొక్కిసలాట..
Maha Kumbh Mela Stampede

మహా కుంభమేళాలో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానం చేసేందుకు లక్షలాది మంది భక్తులు సంగమం వద్దకు చేరుకున్నారు. అనూహ్యంగా పెరిగిన భక్తుల తాకిడికి బారికేడ్లు Read more

ఏపీ సర్కార్ పై కేంద్రమంత్రి ప్రశంసలు
CBN govt

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అభినందనలు కురిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7న నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశాన్ని గొప్ప ఆలోచనగా ప్రశంసించారు. Read more

అరెస్ట్ వారెంట్ పై సోనూ సూద్ క్లారిటీ
Sonu Sood Clarity on Arrest Warrant

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ హీరో సోనూ సూద్ గురించి అందరికీ తెలుసు.. బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ కూడా ఈయనకు మంచి క్రేజ్ ఉంది. తెలుగు సినిమాలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *