man commits suicide by hang

ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య

ఏపీలోని తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరగగా, రేణిగుంట వద్దకు చేరుకున్నాక కండక్టర్ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బస్సులో చివరి సీటు వద్ద హ్యాంగర్‌కు యువకుడు ఉరి వేసుకుని చనిపోయాడు. ఇది గమనించి కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే ఉన్నారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏర్పేడు మండలం అంజిమేడు దగ్గర ఉదయం 5:30కి సదరు యువకుడు బస్ ఎక్కినట్లు కండక్టర్ చెబుతున్నారు. ఉదయం బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో అతను బస్సులోనే.. మంచం నవారి లాంటి తాడుతో పైన కడ్డీకి ఉరి వేసుకుని.. ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తివారి పల్లి వద్ద యువకుడు ఉరికి వేలుడుతూ ఉండటాన్ని గమనించి షాక్ తిన్నారు తోటి ప్రయాణికులు. వెంటనే బస్సు ఆపిన… కండక్టర్, డ్రైవర్.. రేణిగుంట పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. అతడి వివరాలు తెలుసుకునేందుకు ట్రై చేస్తున్నారు.

Related Posts
చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
CBN CYR

చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, జీడి నెల్లూరు ప్రాంతంలో లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి, Read more

నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన
cm revanth

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి 8 రోజుల పాటు విదేశీ పర్యటనకు బయల్దేరుతున్నారు. ఈ పర్యటనలో ఆయన సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాలను సందర్శించనున్నారు. రాష్ట్రాభివృద్ధికి Read more

మహిళ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా
cbn pention

మహిళ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను Read more

వ్యవసాయ కూలీల మృతి – గుంటూరు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేష్ హామీ
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

అమరావతి, ఫిబ్రవరి 17 : గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో Read more