rs praveen

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగతనం

బీఆర్ఎస్ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఆయన సిర్పూర్ పర్యటన కోసం కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని తన నివాసంలో ఉన్న సమయంలో చోటుచేసుకుంది. రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడి, బీరువా తాళాలు పగులగొట్టి కొన్ని విలువైన పత్రాలను దొంగిలించారు.

Advertisements

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు ఉన్నందున పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. ఇంట్లో ప్రాముఖ్యమైన పత్రాలు మాత్రమే దొంగలించబడడం, ఈ సంఘటన వెనుక కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ సంఘటనపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, తెలంగాణలో దోపిడీ దొంగల పాలన కొనసాగుతుందని, తన ఇంటిలో జరిగిన దొంగతనంపై తెలంగాణ డీజీపీ పూర్తి దర్యాప్తు చేపట్టాలని కోరారు.

Related Posts
Telangana: కూతుర్ని ప్రేమించాడని గొడ్డలితో నరికి చంపిన తండ్రి
Telangana: మరో పరువు హత్య! కూతుర్ని ప్రేమించాడని యువకుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి

తెలంగాణలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. కులాలు వేరు కావడం వల్ల ప్రేమను అంగీకరించని తండ్రి, కూతురి ప్రియుడిపై పెత్తనం చెలాయించి అతని ప్రాణం తీశాడు. Read more

కులాల సర్వేపై బీసీ నేతలకు వివరిస్తాం: పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్

కులాల సర్వేపై వెనుకబడిన తరగతుల (బీసీ) సంఘాల నేతలకు వివరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కులాల సర్వే Read more

Assembly: అసెంబ్లీ లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం
అసెంబ్లీ లో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం అప్పులపై జరిగిన చర్చ Read more

‘విజయ’ బ్రాండ్ పేరిట నకిలీ పాల విక్రయం
vijayamilk

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన 'విజయ' బ్రాండ్ పేరుతో నకిలీ పాలు విక్రయిస్తున్న సంఘటనలు వెలుగుచూశాయి. అసలు విజయ డెయిరీ నుంచి వచ్చిన పాలను తక్కువ ధరకు అమ్ముతూ, Read more

×