Former US President Jimmy Carter has passed away

అమెరికా మాజీ అధ్యక్షుడు క‌న్నుమూత‌

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత జిమ్మీ కార్టర్ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్‌లో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు జేమ్స్‌ ఇ. కార్టర్‌ తెలిపారు. “నా తండ్రి నాకు మాత్రమే కాదు, శాంతి, మానవ హక్కులు, నిస్వార్థ ప్రేమను విశ్వసించే ప్రతి ఒక్కరికీ హీరో” అని ఆయ‌న కుమారుడు చిప్ కార్టర్ తెలిపారు. రెండు నెలల క్రితమే (అక్టోబర్‌ 1న) 100వ పుట్టిన రోజు జరుపుకున్న కార్టర్‌.. అమెరికాకు 39వ అధ్యక్షుడిగా వ్యవహరించారు. దీంతో అమెరికా చరిత్రలో ఎక్కువ రోజులు జీవించిన తొలి ప్రెసిడెంట్‌గా రికార్డు సృష్టించారు. 2002లో నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన డెమొక్రటిక్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు.

Advertisements

1924 అక్టోబర్ 1న రైతు కుటుంబంలో జన్మించిన జ‌మ్మీ కార్టర్‌.. అమెరికా రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించారు. 1977లో అసాధార‌ణ రీతిలో ఆయ‌న దేశాధ్యక్ష బాధ్యత‌లు చేప‌ట్టారు. 1981 వరకు ప్రెసిడెంట్‌గా కొనసాగారు. కాగా, 1946లో యూఎస్ నవల్ అకాడమీలో చేరిన జిమ్మీ కార్టర్, ఆ తర్వాత యూఎస్ నేవీ సబ్‌మెరైన్ సర్వీస్‌లో పని చేశారు. మిలిటరీ సేవలు ముగించుకున్న తర్వాత తన కుటుంబంతో కలిసి పల్లీల వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అమెరికాలో పెరిగిపోతున్న జాత్యాహంకారాన్ని చూసి తట్టుకోలేక 1960ల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1971లో తొలిసారిగా జార్జియా రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సరిగ్గా ఆరేండ్ల తర్వాత రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షుడు గెరాల్డ్‌ ఫోర్డ్‌ను ఓడించి జిమ్మీ కార్టర్‌ అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. కాగా, ఆయ‌న భార్య రోసలిన్ (96) 2023 నవంబర్ 19న మరణించారు.

Related Posts
అమల్లోకి ఎన్నికల కోడ్‌.. ​కొత్త పథకాలకు బ్రేక్..!
Election code to come into effect in Telangana.. Break for new schemes.

హైదరాబాద్‌: తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ కొత్తగా నాలుగు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. జనవరి 26న వీటిని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్లు, Read more

ట్రంప్ ఆహ్వానంతో అమెరికా వెళ్లనున్న మోదీ
విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం వైట్‌హౌస్‌ను సందర్శించబోతున్నారని వైట్‌హౌస్ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. జనవరి 27న Read more

KCR : రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయి – KCR
RevanthReddy:కేసీఆర్ కి చెక్ పెట్టె దిశగా రేవంత్ అడుగులు

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మార్పు కోసం ప్రజలు ఆశతో Read more

సిరియాలో తీవ్ర అంతర్యుద్ధం – 745 హత్యలు
సిరియాలో తీవ్ర అంతర్యుద్ధం - 745 హత్యలు

సిరియాలో అంతర్యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 48 గంటల్లోనే 745 మంది ప్రతీకార హత్యలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మైనారిటీ అలావైట్లను లక్ష్యంగా చేసుకుని Read more

Advertisements
×