bird flu

అమెరికాలో బర్డ్ ఫ్లూతో తొలి మరణం

ప్రపంచాన్ని హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్‌‌ఎంపీవీ) వైరస్ భయపెడుతున్న వేళ అమెరికాలో తొలి బర్డ్‌ ఫ్లూ (హెచ్5ఎన్1) మరణం కేసు నమోదు కావడం మరింత కలవరానికి గురిచేస్తున్నది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి.
లూసియానాలో బర్డ్‌ ఫ్లూ (హెచ్5ఎన్1 వైరస్ సోకిన ఓ వ్యక్తి (65) చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతోపాటు పలు ఇతర సమస్యలతో డిసెంబరు నెల మధ్యలో ఆయన ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. దేశంలో ఇదే తొలి సీరియస్ బర్డ్ ఫ్లూ కేసు అని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇటీవల ప్రకటించింది. తాజాగా ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

పెరట్లో ఉన్న అడవి పక్షులు, మందకు దగ్గరగా వెళ్లడం వల్లే ఆయన ఈ వైరస్ బారినపడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టుగా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కాగా, గతేడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 66 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

Related Posts
Pakistan: పాకిస్థాన్ మసీదులో బాంబు పేలుడు
Bomb blast in Pakistan mosque

Pakistan : బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్, తాలిబాన్ల వరుస దాడులతో పాకిస్తాన్ దద్ధరిల్లుతోంది. నిన్ననే హైజాక్ భాగోతం పూర్తయింది. ఈ రోజు అక్కడ మసీదు మరోసారి బాంబు Read more

లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వతంపై ప్రమాదం: ఒండ్రెజ్ హుసెర్కా మరణం
mountain

ఒక ప్రముఖ స్లోవాక్ పర్వతారోహకుడు ఒండ్రెజ్ హుసెర్కా 7,234 మీటర్ల ఎత్తులో ఉన్న నేపాల్‌లోని లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వతాన్ని ఎక్కిన తర్వాత ప్రమాదవశాత్తు మరణించారు. ఈ శిఖరం Read more

చైనా అక్రమలపై భారత్ నిరసన
చైనా అక్రమలపై భారత్ నిరసన

చైనా హోటాన్ ప్రిఫెక్చర్లో రెండు కొత్త కౌంటీలను ఏర్పాటు చేసాయి, ఈ ప్రాంతాలలో కొన్ని భాగాలు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నాయని భారత ప్రభుత్వం శుక్రవారం దౌత్య Read more

డబ్ల్యూహెచ్‌ఓపై ట్రంప్ కీలక నిర్ణయం!
డబ్ల్యూహెచ్ ఓపై ట్రంప్ కీలక నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుండి అమెరికాను ఉపసంహరించుకునే కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు. ఆయన పదవీ బాధ్యతలు Read more