అమిత్ షాపై లాలు ప్రసాద్ ఫైర్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పిచ్చెక్కిందని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై నిన్న రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ లాలు ఇలా విరుచుకుపడ్డారు. ‘అమిత్ షాకు పిచ్చెక్కింది. రాజకీయాలు వదిలేయాలి. వెంటనే రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.

ambedkar images hd

దేవుడిని స్మరిస్తే చాలు
రాజ్యాంగంపై చర్చలో భాగంగా నిన్న రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ మాటిమాటికి ‘అంబేద్కర్’ అనడం కాంగ్రెస్‌కు ఫ్యాషన్ అయిపోయిందన్నారు. .. అంబేద్కర్ అనడం మానేసి అన్నిసార్లు దేవుడిని స్మరిస్తే కనీసం స్వర్గానికైనా వెళ్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎవరి స్థానం వారిదేనని తాము అంబేద్కర్ ను దేవుడిగా భావించడం లేదని, అంబేద్కర్ మన దేశానికీ యెనలేని సేవలను బీజేపీ మర్చిపోవడం సరియేనది కాదని కాంగ్రెస్ పేర్కొంది. అమిత్ షా గర్వం తలకెక్కి మాట్లాడుతున్నారని వారు అన్నారు.

క్షమాపణలు చెప్పాలి
బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ కూడా అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకశక్తిగా మారుతోందని ఆరోపించారు. అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగోర్ నేడు లోక్ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. షా పార్లమెంటులోనే అంబేద్కర్‌ను అవమానించారని, కాబట్టి ఆయన క్షమాపణలు చెప్పడంతోపాటు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్టు మాణికం ఠాగోర్ పేర్కొన్నారు.

Related Posts
యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన మోడీ
narendra modi

భారత యుద్ధనౌకలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి కొద్దిసేపటి ప్రధాని మోడీ జాతికి అంకితం చేసారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్- నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్‌షేర్ Read more

బాబా రాందేవ్‌పై అరెస్ట్‌ వారంట్‌
Arrest warrant for Baba Ramdev

తిరువనంతపురం : పతంజతి ఆయుర్వేద్‌ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రకటనలు ఇస్తోందని దాఖలైన ఫిర్యాదుపై కేరళలోని పాలక్కడ్‌ జిల్లా కోర్టు బాబా రామ్‌దేవ్‌, ఆయన సన్నిహితుడు ఆచార్య బాలకృష్ణలపై Read more

మన్మోహన్ సింగ్ పాడెను మోసిన రాహుల్ గాంధీ
manmohan

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. మన్మోహన్ సింగ్ పాడెను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోశారు. ఈ సందర్బంగా మన్మోహన్ సింగ్ తో Read more

వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం..
JPC approved Waqf Amendment Bill

న్యూఢిల్లీ: ‘వక్ఫ్‌ సవరణ బిల్లు’కు ఆమోదం లభించింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఈరోజు సమావేశమైన పలు ప్రతిపాదనలతో బిల్లుకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *