222

అమిత్‌ షాతో ఒమర్‌ అబ్దుల్లా భేటీ..

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా భేటి అయ్యారు. ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చే అంశంపై చర్చ జరిగింది. ఢిల్లీలో ఈ అరగంట పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం కోసం కేంద్రం పూర్తి మద్దతు ఇస్తామని అమిత్‌షా పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

గతంలో, 2019లో కేంద్ర ప్రభుత్వం 370వ ఆర్టికల్‌ను రద్దు చేయడం ద్వారా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తీసివేసింది, దీంతో జమ్మూకశ్మీర్ మరియు లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారాయి. అయితే, ఈ నిర్ణయం తరువాత ఐదేళ్ల అనంతరం రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవడం ఖాయమైంది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో కూడా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించిన ఒక తీర్మానం ఆమోదించబడింది. అబ్దుల్లా ఈ రోజు సాయంత్రం ప్రధని మోడీని కలుసుకుని ఆ తీర్మానం కాపీని సమర్పించే అవకాశం ఉంది.

ఇకపోతే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ 90 స్థానాలలో 42 స్థానాలను కైవసం చేసుకుని విజయం సాధించింది, దీంతో ఒమర్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Related Posts
తాము చేసిన అభ్యర్థనకు భారత్‌ నుంచి స్పందన రాలేదు: యూనస్‌
We have not received a response from India to our request.. Yunus

ఢాకా: భారత్‌ను మాజీ ప్రధాని షేక్‌ హసీనా అప్పగింతపై అధికారికంగా సంప్రదించినట్లు బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ వెల్లడించారు. కానీ, భారత్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక Read more

మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు
mohanbabu attack

సీనియర్ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. మొన్న జరిగిన ఘర్షణలో TV9 రిపోర్టర్ పై దాడి చేసినందుకు పహాడీ షరీఫ్ Read more

ఆర్ధిక రంగంలో దూసుకెళుతున్న భారతీయ మహిళలు
ఆర్ధిక రంగంలో దూసుకెళుతున్న భారతీయ మహిళలు

స్వయం కృషి ద్వారా మహిళలు అన్ని రంగాలలో తాము ఇతరులకన్నా తక్కువేం కాదని, పురుషులతో సమానమని నిరూపిస్తున్నారు. కానీ ఇప్పుడు వీరు ప్రపంచంలోని అత్యంత ధనిక భారతీయ Read more

కాసేపట్లో కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
CBN govt

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ Read more