indian money

అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంబంధమైన పనులకు చేసిన కొన్ని మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

జీఎస్టీలో కీలక మార్పులు
జీఎస్టీ పోర్టల్‌లో మెరుగైన భద్రత కోసం పన్ను చెల్లింపుదారులు జనవరి 1 నుంచి మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను పాటించడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.

మరోవైపు, 180 రోజుల కంటే పాత బేస్ డాక్యుమెంట్లకు ఈ-వే బిల్లులు (ఈడబ్ల్యూ‌బీలు) జనరేట్ కావు.
ఫీచర్ ఫోన్లలో యూపీఐ పేమెంట్స్ పరిమితి పెంపు ‘యూపీఐ 123పే’ ద్వారా ఫీచర్ ఫోన్లలో పేమెంట్లు చేస్తున్నవారు ఇవాళ్టి నుంచి రోజుకు గరిష్ఠంగా రూ.10,000 వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా మునుపటి రూ.5,000 పరిమితిని ఆర్బీఐ పెంచింది.


ఈపీఎఫ్‌వో కొత్త రూల్
కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థలో (సీపీపీఎస్) భాగంగా పెన్షన్ ఉపసంహరణను ఈపీఎఫ్‌వో క్రమబద్ధీకరించిది. దీంతో, పెన్షన్ ఉపసంహరణ మరింత సులభంగా మారింది. పెన్షనర్లు ఇకపై దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌ను ఉపసంహరించుకోవచ్చు. అదనపు ధ్రువీకరణ ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి. మరోవైపు, ఈపీఎఫ్‌వో త్వరలోనే ఏటీఎం కార్డులను జారీ చేయనుంది.

అంతేకాదు, ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ పరిమితిని కూడా ప్రభుత్వం ఈ ఏడాది తొలగించే అవకాశాలు ఉన్నాయి.దేశంలోని రైతులు ఇకపై రూ.2 లక్షల వరకు హామీలేని బ్యాంక్ రుణాన్ని పొందవచ్చు. ఈ మేరకు మునుపటి రూ.1.60 లక్షల పరిమితిని ఆర్బీఐ పెంచింది.

హెచ్-1బీ వీసాలో మార్పులు
ఇవాళ్టి నుంచి భారతదేశంలోని నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు తమ వీసా అపాయింట్‌మెంట్‌ను ఉచిత రీషెడ్యూల్‌ చేసుకోవచ్చు. అయితే, రెండవసారి రీషెడ్యూల్ చేయాలనుకుంటే కొత్త దరఖాస్తుతో పాటు వీసా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది.

అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్‌ ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. మరోవైపు, జనవరి 17 నుంచి హెచ్-1 వీసా ప్రక్రియ అప్‌డేట్ కానుంది.

Related Posts
అదానీపై US కోర్టు కేసులో ఊహించని ట్విస్ట్
adani news

అదానీపై అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు కేసులో మరో టర్న్. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్పై US DOJ లంచం, అవినీతి అభియోగాలు నమోదే చేయలేదని Read more

కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
Encounter in Kupwara. Terrorist killed

శ్రీనగర్‌: మరోసారి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు తాజాగా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఘటనా స్థలం Read more

డైరెక్టర్ శంకర్ ఆస్తుల జప్తు పై హైకోర్టు కీలక ఉత్తర్వులు
డైరెక్టర్ శంకర్ ఆస్తుల జప్తు పై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ప్రముఖ సినీ దర్శకుడు శంకర్‌కు మద్రాస్ హైకోర్టు కీలక ఉపశమనం కల్పించింది. ‘ఎంథిరన్’ (‘రోబో’) సినిమాకు సంబంధించిన ఆర్థిక అవకతవకల ఆరోపణలతో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఆయన Read more

తిరుపతి ఘటనతో శబరిమల దేవస్థానం కీలక నిర్ణయం!
sabarimala

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది చనిపోవడం దేశంలోని సంచల వార్తగా మారింది. దీనితో మకరజ్యోతి దర్శనం వేళ భక్తుల సంఖ్య అనూహ్యంగా ఉండటంతో దేవస్థానం కీలక Read more