ktr

అప్పులపై అవాస్తవాలు: కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధ నడుస్తున్నది. తెలంగాణ అప్పులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఉద్దేశపూర్తంగా తప్పుడు సమాచారం ఇచ్చారని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు సభా హక్కుల ఉల్లంఘటన నోటీసు ఇస్తున్నామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.
సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం అని ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల విడుదల చేసిన నివేదిక నిరూపించింది. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూ.3,89,673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించింది. అప్పులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. అందువల్ల తెలంగాణ శాసనసభ కార్య విధాన, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరఫున ఆర్థిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామని ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ వెల్లడించారు.

Advertisements
Related Posts
Telengana: భారీ వర్షాలు, వడగండ్లతో చల్లబడిన హైదరాబాద్
Telangana: భారీ వర్షాలు, ఉరుములతో చల్లబడిన హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఆకస్మిక వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. శుక్రవారం ఉదయం Read more

తెలంగాణ నిధుల కోసం పోరాడుతా :రేవంత్ రెడ్డి
తెలంగాణ నిధుల కోసం ఢిల్లీలో ధర్నాకు సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం విడుదల చేయకపోతే, అవసరమైతే Read more

మాంజా దారం తగిలి తెగిన గొంతు..పరిస్థితి విషమం
China Manja Causes Severe Injury in Bhadrachalam

గాలిపటం మాంజా దారాల వల్ల చోటుచేసుకుంటున్న ప్రమాదాలు అన్నీఇన్నీ కావు. ఈ ప్రమాదాలు చిన్నారుల నుంచి పెద్దవారిదాకా తీవ్ర గాయాలను కలిగిస్తూ, కొన్నిసార్లు ప్రాణాలే బలి తీసుకుంటున్నాయి. Read more

పుష్ప 2 తొక్కిసలాటపై ఒవైసీ వ్యాఖ్యలు
పుష్ప 2 తొక్కిసలాటపై ఒవైసీ వ్యాఖ్యలు

అల్లు అర్జున్‌ తొక్కిసలాట జరిగిన సినిమా చూసాడు: అక్బరుద్దీన్ ఒవైసీ AIMIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, హైదరాబాద్‌లో తన బ్లాక్‌బస్టర్ చిత్రం 'పుష్ప 2: ది రూల్' Read more

×