‘అన్న క్యాంటీన్‌’ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్టు

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లకు విరాళాలపై ఆదాయ పన్ను మినహాయింపును కల్పిస్తూ కొత్త ఛారిటబుల్ ట్రస్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద విరాళాలు సేకరించేందుకు, ఈ ట్రస్టు ప్రారంభానికి కేంద్ర ఆదాయపన్ను, కార్పొరేట్ వ్యవహారాల శాఖల నుంచి అనుమతులు లభించాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 204 క్యాంటీన్లలో అన్న క్యాంటీన్ సేవలు అందుబాటులో ఉండగా, రోజుకు సుమారు 1.50 లక్షల మందికి భోజనం ఇస్తున్నారు. తక్కువ ధరలో మూడు పూటల భోజనం అందించేందుకు ప్రభుత్వం సబ్సిడీ కింద రోజుకు కోటి రూపాయలు ఖర్చు చేస్తోంది.

విరాళాల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా సిద్ధం చేశారు. దాతలు దానం చేసిన మొత్తం ఆధారంగా, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల కోసం ప్రత్యేక విరాళాలు సేకరించనున్నారు. ఉదాహరణకు, రూ.26.25 లక్షలు విరాళం ఇస్తే ఒక రోజు మొత్తం ఆహారం వారి పేరుతో అందించబడుతుంది. ఇక విరాళాలపై ఆన్‌లైన్ రసీదులు అందుబాటులో ఉంటాయి, వీటి ద్వారా ఆదాయపన్ను మినహాయింపును పొందొచ్చు.

Related Posts
అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది – ట్రంప్
trump

అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని, తమ దేశ సైన్యాన్ని ప్రపంచంలో ఎవరూ ఊహించలేని విధంగా పునర్నిర్మాణం చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడిన Read more

Maheshwar Reddy : తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
Telangana state is mired in debt.. Yeleti Maheshwar Reddy

Maheshwar Reddy: బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. ఆప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం Read more

ఇసావోట్ అత్యాధునిక ఓ -స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌
Esaote is a state of the art O Scan MRI machine

హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ వాస్కులర్, ఎండోవాస్కులర్ & పొడియాట్రిక్ సర్జన్‌లలో ఒకరైన డాక్టర్ నరేంద్రనాధ్ మేడా ఇటీవల అత్యాధునిక ఇసావోట్ యొక్క ఓ -స్కాన్ ఎంఆర్ఐ Read more

వంజంగి మేఘాల కొండ,కొత్తపల్లి జలపాతం వద్ద కిక్కిరిసిన పర్యాటకులు
vanjangi

అల్లూరి జిల్లా లో పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకులతో ఆదివారం కిటకిటలాడాయి.ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన వంజoగి మేఘాల కొండను తిలకించేందుకు పర్యాటకులు తెల్లవారు జాము నుంచే Read more